UNION BUDGET 2024 : బడ్జెట్ లో యువత.. మహిళల కోసం ప్రత్యేక పథకాల ప్రకటన

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. తన బడ్జెట్ ప్రసంగంలో అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా బడ్జెట్ తీసుకువచ్చినట్టు ప్రకటించారు. ముఖ్యంగా, యువత-మహిళల కోసం ప్రత్యేక పథకాలు తీసుకువస్తున్నట్టు చెప్పారు.

New Update
Union Budget 2024: యువతకు నిర్మలమ్మ అదిరిపోయే శుభవార్త.. కోటి మందికి..

Youth And Women Development : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. తన బడ్జెట్ ప్రసంగంలో అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా బడ్జెట్ తీసుకువచ్చినట్టు ప్రకటించారు. ముఖ్యంగా, యువత-మహిళల కోసం ప్రత్యేక పథకాలు తీసుకువస్తున్నట్టు చెప్పారు. ఇందులో భాగంగా విద్య, నైపుణ్యాభివృద్ధికి రూ.లక్షా 48 వేల కోట్లు కేటాయించినట్లు ప్రకటించారు. అలాగే వ్యవసాయం డిజిటలైజేషన్‌ కోసం ప్రత్యేక కార్యక్రమం 400 జిల్లాల్లో అమలు చేస్తామన్నారు. ఇక యువతకు  మూడు స్కీంల ద్వారా ఉద్యోగ కల్పన దిశలో ప్రయతనాలు చేస్తామని వెల్లడించారు. కొత్తగా ఉద్యోగాల్లో చేరేవారి కోసం ఈపీఎఫ్‌వో పథకం తీసుకురానున్నట్టు నిర్మలా సీతారామన్  చెప్పారు. ఇక వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్ ఏర్పాటు చేస్తామనీ,  20 లక్షల మంది యువత శిక్షణకు సరికొత్త కార్యక్రమం అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే మహిళలనైపుణ్య అభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహణ కోసం ఏర్పాట్లు చేస్తామన్నారు.

అప్ డేట్ అవుతోంది..

Also Read : కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ప్రత్యేక సదుపాయాలు


Advertisment
Advertisment
తాజా కథనాలు