కడెంకు ముప్పు తప్పినట్టేనా..? అక్కడ ప్రస్తుత వరద ఉధృతి ఎలా ఉందంటే..?

వర్షం ఆగిపోవడంతో నిర్మల్‌ జిల్లా కడెం ప్రాజెక్టుకు వరద ముప్పు తప్పింది. ప్రాజెక్టు పూర్తిస్తాయి నీటిమట్టం 700 అడుగులు ఉండగా.. ప్రస్తుత నీటిమట్టం 687 అడుగులగా ఉంది. మరోవైపు ప్రాజెక్టు మోటర్లు నాసిరకంగా ఉండడంతో వాటికి మరమ్మతులు చేస్తున్నారు అధికారులు.

కడెంకు ముప్పు తప్పినట్టేనా..? అక్కడ ప్రస్తుత వరద ఉధృతి ఎలా ఉందంటే..?
New Update

వరుణుడు శాంతించాడు.. నిన్నమొన్నటివరకు నాన్‌స్టాప్‌ వర్షంతో బీభత్సం సృష్టించిన వాన దేవుడు ఎట్టకేలకు రిలాక్స్‌ అయ్యాడు. భయపెట్టింది చాలులే అనుకున్నాడేమో ప్రస్తుతానికి అయితే తన ప్రతాపం చూపించడం ఆపేశాడు. ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షం ఆగిపోవడంతో నిర్మల్‌ జిల్లా(Nirmal district) కడెం(Kadem) ప్రాజెక్టుకు వరద(Flood) ముప్పు తప్పినట్టైంది. కడెం ప్రాజెక్టు(Kadem project) వరద సాధారణ స్థితికి వచ్చింది. ప్రమాదపు అంచు నుంచి సాధారణ స్థాయికి కడెం ప్రాజెక్టు నీటిమట్టం చేరుకోవడంతో అంతా హమ్మయ్య అనుకుంటున్నారు. అటు ఇరిగేషన్‌(Irrigation) అధికారులు మాత్రం జాగ్రత్తలు తీసుకుంటునే ఉన్నారు. సీన్‌ ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు కాబట్టి ప్రాజెక్టు దగ్గరే ఉండి నీటి సామర్థ్యాన్ని పరిశీలిస్తున్నారు.

కడెంకు ముప్పు తప్పినట్టేనా..?
కడెం ప్రాజెక్టుకు వరద ఉధృతి తగ్గడంతో ముప్పు ప్రాంతాల ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ప్రస్తుతానికి ప్రాజెక్టు 10గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్తాయి నీటిమట్టం 700 అడుగులు ఉండగా.. ప్రస్తుత నీటిమట్టం 687 అడుగులగా ఉంది. గోదావరి నదికి ఉపనది అయిన ఈ రిజర్వాయర్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా మీదుగా ప్రవహిస్తుంది. అటు ప్రాజెక్టుకు సంబంధించి తలెత్తిన సమస్యలను అధికారులు చక్కదిద్దే పనిలో ఉన్నారు. మోటర్లు నాసిరకంగా ఉండడంతో వాటికి మరమ్మతులు చేస్తున్నారు. డ్యామ్ 18 గేట్లలో నాలుగు ప్రభావితమయ్యాయి.

నిజానికి ఈ మోటర్ల సమస్య చాలా కాలంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇరిగేషన్‌ అధికారులు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. వరద నీరు తగ్గుముఖం పట్టిందని.. ప్రస్తుతం ప్రాజెక్టు నుంచి ప్రజలకు ఎలాంటి ముప్పు ఉండదంటున్నారు. మోటార్లలో సమస్య ఉండడంతో నాలుగు గేట్లు తెరవలేదని చెప్పారు. వేసవిలో గేట్లను తనిఖీ చేస్తున్నప్పుడు ఆ మోటార్లను డిపార్ట్‌మెంట్ పరీక్షించిందన్నారు. ప్రస్తుతం నాలుగు గేట్లకు మోటార్ల మరమ్మతులు కొనసాగుతున్నాయని.. దీనికోసం తమ ఇంజనీర్లు తీవ్రంగా శ్రమిస్తున్నట్టు తెలిపారు.

ఎక్కడ ఎంత వర్షం పడిందంటే?
మరోవైపు తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గత 48 గంటల్లో, రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. జయశంకర్-భూపాలపల్లి జిల్లా చిట్యాలలో వర్షపాతం 600 మిల్లీమీటర్లు దాటింది. తెలంగాణ స్టేట్ ప్లానింగ్ డెవలప్‌మెంట్ సొసైటీ డేటా ప్రకారం కడెం జలాశయం ఉన్న నిర్మల్ జిల్లాలో 115.6 నుంచి 204.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గురువారం(జులై 27) ఒక్కరోజే ఉదయం 8:30 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య నిర్మల్ జిల్లాలో అత్యధికంగా 204.4 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డయింది. అటు అటవీ ప్రాంతంలో పొంగిపొర్లుతున్న వాగు కారణంగా ములుగు జిల్లాలోని జలపాతం వద్ద చిక్కుకుపోయిన 160 మంది పర్యాటకులను ఇప్పటికే సురక్షితంగా రక్షించారు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe