వరుణుడు శాంతించాడు.. నిన్నమొన్నటివరకు నాన్‌స్టాప్ వర్షంతో బీభత్సం సృష్టించిన వాన దేవుడు ఎట్టకేలకు రిలాక్స్ అయ్యాడు. భయపెట్టింది చాలులే అనుకున్నాడేమో ప్రస్తుతానికి అయితే తన ప్రతాపం చూపించడం ఆపేశాడు. ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షం ఆగిపోవడంతో నిర్మల్ జిల్లా(Nirmal district) కడెం(Kadem) ప్రాజెక్టుకు వరద(Flood) ముప్పు తప్పినట్టైంది. కడెం ప్రాజెక్టు(Kadem project) వరద సాధారణ స్థితికి వచ్చింది. ప్రమాదపు అంచు నుంచి సాధారణ స్థాయికి కడెం ప్రాజెక్టు నీటిమట్టం చేరుకోవడంతో అంతా హమ్మయ్య అనుకుంటున్నారు. అటు ఇరిగేషన్(Irrigation) అధికారులు మాత్రం జాగ్రత్తలు తీసుకుంటునే ఉన్నారు. సీన్ ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు కాబట్టి ప్రాజెక్టు దగ్గరే ఉండి నీటి సామర్థ్యాన్ని పరిశీలిస్తున్నారు.
పూర్తిగా చదవండి..కడెంకు ముప్పు తప్పినట్టేనా..? అక్కడ ప్రస్తుత వరద ఉధృతి ఎలా ఉందంటే..?
వర్షం ఆగిపోవడంతో నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు వరద ముప్పు తప్పింది. ప్రాజెక్టు పూర్తిస్తాయి నీటిమట్టం 700 అడుగులు ఉండగా.. ప్రస్తుత నీటిమట్టం 687 అడుగులగా ఉంది. మరోవైపు ప్రాజెక్టు మోటర్లు నాసిరకంగా ఉండడంతో వాటికి మరమ్మతులు చేస్తున్నారు అధికారులు.

Translate this News: