Niranjan Reddy: ఆ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి: మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

TG: బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. రాజీనామా చేసి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని అన్నారు. పార్టీ ఫిరాయింపులపై రాహుల్‌ గాంధీకి లేఖ రాస్తున్నట్లు చెప్పారు.

Niranjan Reddy: ఐదెకరాలలోపు రైతులకు రైతుభరోసా ఇవ్వాలి: మాజీ మంత్రి నిరంజన్
New Update

Niranjan Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారడంపై మాజీ మంత్రి నిరంజన్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజీనామా చేసి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని అన్నారు. పార్టీ ఫిరాయింపులపై రాహుల్‌ గాంధీకి లేఖ రాస్తున్నట్లు చెప్పారు. ఫిరాయింపులకు వ్యతిరేకంగా గతంలో రాహుల్‌ చేసిన వ్యాఖ్యలను పొందుపరుస్తూ లేఖ రాస్తున్నట్లు తెలిపారు. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళ్లడం సిగ్గు చేటు అని మండిపడ్డారు.

దమ్ముంటే బీఆర్ఎస్ బీ ఫామ్ మీద గెలిచి పార్టీ మారిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని అన్నారు. ఎన్నికలు వెళ్తే ప్రజలే వీరికి బుద్ధి చెబుతారని చెప్పారు. పార్టీ ఫిరాయింపులు తప్పు అని.. నేతలు వారి పదవులకు రాజీనామా చేసి వీరే పార్టీలో చేరాలని చెప్పిన రాహుల్ గాంధీ.. ఇప్పుడు వారి పార్టీయే ఇలాచేస్తుంటే ఏం చూస్తున్నారని అని ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత కాంగ్రెస్ లోకి  చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య ఏడుకు చేరింది.

ఈరోజు కాంగ్రెస్ గూటికి మరో ఎమ్మెల్యే..

సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి. సీఎం రేవంత్, తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి  దీపదాస్ మున్షీ సమక్షంలో కృష్ణమోహన్ రెడ్డి కారు దిగి, కేసీఆర్ కు బై చెప్పి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాగా మరో ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేపు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

#niranjan-reddy
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe