గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో బుధవారం ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. అహ్మదాబాద్‌లోని ఎస్‌జి హైవేపై ఈ ప్రమాదం జరిగింది. అతివేగంతో ప్రయాణిస్తున్న జాగ్వార్ వాహనం అదుపు తప్పి రోడ్డుపై ఉన్న జనాలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది దుర్మరణం చెందగా, పలువురు గాయపడ్డారు. ఎస్‌జి హైవేపై మొదట థార్ వాహనాన్ని లారీ ఢీకొట్టింది. దీంతో అక్కడ జనం గూమిగూడారు. అంతలోనే జాగ్వార్ వాహనం అతివేగంతో దూసుకువచ్చింది. అదుపు తప్పి రోడ్డుపై నిలుచుకున్నవారిపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 9మంది అక్కడిక్కడే మరణించారు. ప్రమాదం జరిగిన తర్వాత డ్రైవర్ లారీని తీసుకుని పరారయ్యాడు.
మృతి చెందిన వారిలో పోలీస్ కానిస్టేబుల్, హోంగార్డు :
ఎస్‌జీ హైవేపై ఇస్కాన్ వంతెనపై ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. ఇందులో జాగ్వార్ వాహనం వంతెనపై నిలబడి ఉన్నవారిపై దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన వాహనం ఢీకొనడంతో 9 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఒక పోలీసు కానిస్టేబుల్, హోంగార్డు జవాన్ కూడా ఉన్నారు. అదే సమయంలో దాదాపు 9 నుంచి 10 మంది వరకు గాయపడినట్లు సమాచారం.
ప్రమాదం కారణంగా జనం గుమిగూడారు:
ఇస్కాన్ వంతెన వద్ద మధ్యాహ్నం 1:15 గంటలకు మహీంద్రా థార్ వాహనం ట్రక్కును ఢీకొట్టింది, దానిలో చిక్కుకున్నవారిని తీసేందుకు జనాలు గూమిగూడారు. అప్పుడు అతివేగంతో జాగ్వార్ వాహనం అక్కడికి వచ్చి హైవేపై నిలబడి ఉన్న వ్యక్తులపైకి దూసుకెళ్లింది. ఈ కారు స్పీడ్ ఎక్కువగా ఉండడంతో డ్రైవర్ వాహనాన్ని నియంత్రించలేకపోయాడు. ఈ ప్రమాదంలో వాహనం డ్రైవర్ కూడా గాయపడ్డారు.