సూడాన్ లోని పోర్ట్ ఎయిర్ పోర్టులో పౌర విమానం కూలిపోయింది. ఈ ఘటనలో నలుగురు ఆర్మీ సిబ్బందితోపాటు మొత్తం 9మంది మరణించారు. ఈ ప్రమాదంలో ఓ బాలిక ప్రాణాలతో బయటపడినట్లు సైన్యం తెలిపింది. ఆర్మీని ఉటంకిస్తూ..వార్తా సంస్థ రాయిటర్స్ ఈ విషయాన్ని తెలిపింది. విమానం టేకాఫ్ సమయంలో సాంకేతిక లోపం తలెత్తడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు సైన్యం వెల్లడించింది.
టెక్నికల్ లోపం వల్ల సూడాన్ ఎయిర్ పోర్టులో పౌర విమానం కూలింది. ఈ ప్రమాదంలో నలుగురుసైనిక సిబ్బందితోపాటు మొత్తం తొమ్మిది మంది మరణించారు. విమానం టేకాఫ్ సమయంలో కూలింది అని సైన్యం ట్వీట్ చేసింది.
అయితే ఈ ప్రమాదంలో మరణించినవారి వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. వారిని గుర్తించిన తర్వాత మృతులందరి పేర్లను వెల్లడిస్తామని అధికారులు చెప్పారు. విమానంకూలిపోయిందన్న వార్త తెలియగానే ప్రయాణికులు, బంధువులు విమానశ్రయం దగ్గరికి చేరుకున్నారు. సాంకేతిక లోపమే విమానశ్రయంలో విమానం కూలిపోవడానికి కారణమని సూడాన్ ఆర్మీ అధికారులు వెల్లడించారు. సాంకేతిక లోపం కారణంగానే విమానంలో ఒక్కసారి మంటలు చెలగాయి. ఫైరింజన్ సాయంతో విమానంలోని మంటలను ఆర్పివేశారు. అయితే ప్రమాదానికి గల కారణాల గురించి అన్వేషణ ప్రారంభమైంది.
రెండు సంవత్సరాల క్రితం కూడా సూడాన్ రాజధాని ఖార్జూమ్ లో ఓ సైనిక విమానం కూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అధికారులు మరణించారు. ఈ విషయాన్ని పీఎం కార్యాలయం నుంచి అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. అల్ షెగిలాబ్ లో బుధవారం కూలిన విమానం ప్రమాదంలో ముగ్గురు ఆర్మీ అధికారులు ప్రాణాలు కోల్పోయారు.