AP: జగన్ పాలనలో వారికి భద్రత లేదు: మంత్రి నిమ్మల రాష్ట్రంలో సహకార సంఘాలు, రూరల్ బ్యాంకులను మాజీ సీఎం జగన్ నిర్వీర్యం చేశాడని ఆరోపించారు మంత్రి నిమ్మల రామానాయుడు. పాలకొల్లు మార్కెట్ యార్డులో ఆయన మాట్లాడుతూ.. జగన్ ఐదేళ్ల పాలనలో ఉద్యోగులకు భద్రత లేదన్నారు. By Jyoshna Sappogula 29 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి New Update షేర్ చేయండి Nimmala Ramanaidu: రాష్ట్రంలో సహకార సంఘాలు, రూరల్ బ్యాంకులను జగన్ గత ఐదేళ్లలో నిర్వీర్యం చేశాడని ఆరోపించారు మంత్రి నిమ్మల రామానాయుడు. పాలకొల్లు మార్కెట్ యార్డులో సహకార సంఘాలు, రూరల్ బ్యాంకు ఉద్యోగుల యూనియన్ మహాజన సభ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సహకార సంఘాలు, రూరల్ బ్యాంకులు అంటే తనకు చాలా గౌరవమని, తాను కోపరేటివ్ సహకార సంఘం అధ్యక్షుడిగా పనిచేశానన్నారు. రైతులకు సహకారం చేసేది సహకార సంఘాలని, మంచి సహకారాలు అందిస్తే రైతులు చిరునవ్వుతో పంటలు పండించి అందిస్తారన్నారు. అటువంటి సహకార సంఘాలలో పనిచేసే ఉద్యోగులు.. మంచి పే స్కేల్స్, ఉద్యోగ భద్రత కల్పిస్తేనే రైతులకు మంచి సేవలు అందుతాయన్నారు. ఉద్యోగులకు DCCB, APCOBల నుండి జీతాలు చెల్లించాలని గత టీడీపీ ప్రభుత్వంలో ఆదేశాలు జారీ చేశామన్నారు. దురదృష్టవశాత్తు జగన్ ఐదేళ్ల పాలనలో ఆదేశాలను తుంగలో తొక్కారన్నారు. #nimmala-ramanaidu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి