Nimmagadda Ramesh: ఇలా చేస్తే ఈసీ ఆదేశాలను ధిక్కరించినట్టే: నిమ్మగడ్డ రమేశ్‌

వాలంటీర్ల ద్వారా లబ్ధిపొందాలని చూస్తే ఈసీ ఆదేశాలను ధిక్కరించినట్లే అవుతుందని సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ పేర్కొన్నారు. ఎన్నికల విధులకు వాలంటీర్లను దూరంగా ఉంచాలని కోర్టు ఆదేశించినా.. దానికి భిన్నంగా వైసీపీ వ్యవహరిస్తోందని విమర్శలు గుప్పించారు.

New Update
Nimmagadda Ramesh:  ఇలా చేస్తే ఈసీ ఆదేశాలను ధిక్కరించినట్టే: నిమ్మగడ్డ రమేశ్‌
Nimmagadda Ramesh: తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో  ‘ఓటు వేద్దాం-ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌. ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో వాలంటీర్ల ద్వారా లబ్ధిపొందాలని చూస్తే ఈసీ ఆదేశాలను ధిక్కరించినట్లే అవుతుందని పేర్కొన్నారు. ఈ క్రమంలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
తిరుపతి ఉప ఎన్నికల్లో నకిలీ ఈఆర్‌వో పనిచేశారన్నారు. ఎన్నికల్లో ఇలా నకిలీ అధికారులు పనిచేయడం ఆందోళన కలిగిస్తుందని చెప్పుకొచ్చారు. ఓటర్ల వివరాలను వాలంటీర్లు అధికార పార్టీకి అందిస్తున్నారని కామెంట్స్ చేశారు. వైసీపీ కోసం వాలంటీర్లు కష్టపడాలన్న మంత్రుల వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు. అధికారులు ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాలని కోరారు. నిర్లక్ష్యం చేస్తే ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు. ఎన్నికల విధులకు వాలంటీర్లను దూరంగా ఉంచాలని కోర్టు ఆదేశించినా.. దానికి భిన్నంగా అధికార పార్టీ వ్యవహరిస్తోందని విమర్శించారు.
కాగా, గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లకి ఎన్నికల విధుల కేటాయింపుపై సీఈసీ స్పష్టత ఇచ్చింది. ఓటర్ల చేతికి ఇంకు మార్క్ లాంటి చిన్న పనులకు మాత్రమే సచివాలయ సిబ్బంది వాడాలని పేర్కొంది. వాలంటీర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల విధుల్లో వాడకూడదని హెచ్చరించింది. వాలంటీర్లను పోలింగ్ ఏజెంట్ గ అనుమతించకూడదని తేల్చిచెప్పింది.
Advertisment
తాజా కథనాలు