Chaitanya post: విడాకుల పై నిహారిక కామెంట్స్.. ఘాటుగా రియాక్ట్ అయిన మాజీ భర్త విడాకుల గురించి ఒకరి వైపే మాట్లాడకండంటూ నిహారిక ఇంటర్యూపై మాజీ భర్త చైతన్య స్పందించారు. నిహారిక ఇంటర్వ్యూను హోస్ట్ చేసిన వ్యక్తికి ఇలా పోస్ట్ చేశాడు. విడాకుల బాధ రెండు వైపులా ఒకే విధంగా ఉంటాయన్నారు చైతన్య. కానీ ఒక వైపు మాట్లాడటం చాలా తప్పు అని చెప్పారు. By Archana 27 Jan 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Chaitanya post: మెగా డాటర్ నిహారిక 2020 లో చైతన్య జొన్నల గడ్డను ఘనంగా వివాహం చేసుకున్నారు. పెళ్ళైన మూడు సంవత్సరాలకు ఈ జంట కొన్ని కారణాల చేత విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సోషల్ మీడియాలో నిహారిక విడాకులు చర్చగా మారాయి. ఆమె విడాకుల పై రకరకాల అభిప్రాయలు బయటకు వచ్చాయి. కానీ నిహారిక వాటికి ఎలాంటి స్పందన ఇవ్వలేదు. అయితే తాజాగా యూట్యూబర్ నిఖిల్ విజయేంద్ర సింహ హోస్ట్ చేసిన ఓ పాడ్ కాస్ట్ లో పాల్గొన్న నిహారిక తొలిసారి విడాకుల పై స్పందిస్తూ.. కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అయితే ఈ విషయంలో నిహారిక మాజీ భర్త చైతన్య ఘాటుగా స్పందించారు. ఇన్స్టా గ్రామ్ లో హోస్ట్ నిఖిల్ నిహారిక ఇంటర్వ్యూ పోస్ట్ చేయగా.. అతనికి రిప్లై గా ఇలా పోస్ట్ ఈ విధంగా కామెంట్ పెట్టారు. చైతన్య రియాక్షన్ "హాయ్ నిఖిల్.. విడాకుల తర్వాత నిహారిక పై వస్తున్న నెగెటివిటీని దూరం చేయడానికి ఇంటర్వ్యూ ద్వారా మీరు చేసిన ప్రయత్నాన్ని నేను నిజంగా అభినందిస్తున్నాను. వ్యక్తిగతంగా వచ్చే విమర్శలను ఎదుర్కోవడం అంత ఈజీ కాదని నాకు తెలుసు. అయితే వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఒకరి పక్షానే మాట్లాడడం.. వారి వైపు వాదనలు మాత్రమే వినిపించడం సరికాదు. ఇలాంటి వాటిని ఇతరులకు మరింత చేరువ చేయడానికి ఇటువంటి మాధ్యమాలను ఉపయోగించడం మానేయాలి. ఇలా జరగడం రెండో సారి. పెళ్లి తర్వాత ఇద్దరికీ సెట్ అవ్వకపోవడం.. దాని వల్ల కలిగే బాధ నుంచి బయటకు రావడం రెండు వైపుల ఒకే విధంగా ఉంటుంది అంటూ గట్టిగా రియాక్ట్ అయ్యారు చైతన్య. Also Read: Prabhas: రాజాసాబ్ నుంచి సూపర్ అప్డేట్.. రిలీజ్ అప్పుడే ఇద్దరి మధ్య విడాకుల ప్రక్రియ పూర్తయిన తర్వాత దాని గురించి చర్చించకూడదు. ముఖ్యంగా ఈ విషయం పై ఒకరి వైపు నుంచే మాట్లాడడం సరైనది కాదు. అయితే పెళ్లిబంధం బ్రేక్ అయిన తర్వాత కలిగే బాధ.. దాని నుంచి బయటకు రావడం విషయాల గురించి జనరలైజ్ చేసి మాట్లాడవచ్చు.. ఈ చర్చ ఇతరులకు హెల్ప్ అవ్వచ్చు. ఒకేవేళ ఈ అంశం పై నిజంగా మీరు ప్రజలకు అవగాహన కల్పించాలనుకుంటే.. రెండు వైపుల నిజాలను తెలుసుకుంటే మంచిది. భవిష్యత్తులో ఇలాంటి ఇంటర్వ్యూ లు చేసే ముందు ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని నా అడ్వైస్. విషయాలను పూర్తిగా తెలుసుకోకుండా జనాలకు అసత్యాలను ప్రచారం చేయడం అన్యాయం. నాణేనికి రెండు వైపులా చూపిస్తేనే నిజమవుతుంది. ఒక వైపు మాత్రమే చూపించి అదే నిజమని చెబితే అబద్దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన వాళ్ళు అవుతారు. ఇదంతా మీకు క్లియర్ గా అర్థమవుతుందని అనుకుంటున్నాను అంటూ" .. చైతన్య.. నిఖిల్ పోస్ట్ చేసిన వీడియో కింద కామెంట్ చేశారు. View this post on Instagram A post shared by Nikhil Vijayendra Simha (@nikhilvijayendrasimha) Also Read: Pindam OTT Release: ఓటీటీలో భయపెట్టడానికి వచ్చేస్తున్న పిండం.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే #niharika-konidela #niharika-husband-reaction-on-divorce మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి