'బిగ్ బాస్-7'లోకి నిహారిక క్లోజ్ ఫ్రెండ్.. అత్తతో రచ్చ చేస్తాడా?

నిఖిల్ షోలతో పాటు పలు చిత్రాల్లో కూడా నటించాడు. దీంతో ఈ కుర్రాడి కెరీర్ సక్సెస్‌ ఫుల్‌ గా సాగుతోంది. నిహారికా కొణిదెలకు క్లోజ్ ఫ్రెండ్ అయిన అతడికి గతంలోనూ ఆఫర్ వచ్చింది. అయితే ఏవో కారణాలతో రాలేకపోయాడు. దీంతో ఈ సీజన్ లో నిఖిల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని తెలుస్తోంది. అలాగే నిఖిల్ కి బిగ్ బాస్ నిర్వాహకులు భారీ మొత్తం ఆఫర్ చేశారని మరో టాక్ కూడా వినిపిస్తుంది. నిఖిల్ బిగ్ బాస్ సీజన్ 7లోకి ఎంట్రీ ఇవ్వడం దాదాపుగా ఖాయం అనే టాక్ సోషల్ మీడియాలో..

New Update
'బిగ్ బాస్-7'లోకి నిహారిక క్లోజ్ ఫ్రెండ్.. అత్తతో రచ్చ చేస్తాడా?

Anchor Nikhil in Bigg Boss 7: తెలుగు బుల్లితెర బిగ్ రియాల్టీ షో 'బిగ్ బాస్'. ఫస్ట్ సీజన్ తో టీవీల దగ్గర నుంచి కదలనివ్వని ఈ షో.. సీజన్లు పెరిగే కొద్దీ మరింత ప్రజాధారణను సొంతం చేసుకుంటుంది. సీజన్ల మీద సీజన్లు కంప్లీట్ చేసుకుంటున్న బిగ్ బాస్ షో.. రేటింగ్ పరంగా నేషనల్ రికార్డులను క్రియేట్ చేస్తుంది. ఇప్పటికే ఆరు సీజన్లను పూర్తి చేసుకున్న ఈషో.. సీజన్-7ని మొదలు పెట్టనున్నారు. అలాగే బిగ్ బాస్ లోకి తీసుకునే కంటెస్టెంట్ల విషయంలోనూ షో నిర్వాహకులు చాలా శ్రద్ధ చూపిస్తారు. ఎక్కడా కూడా ఎంటర్టైన్ మెంట్ కి కొదవ లేకుండా.. బోరింగ్ రాకుండా ముందుగానే ప్లాన్ చేస్తారు. అందుకే హౌస్ లోని కంటెస్టెంట్ లకు ఫిజికల్ టాస్క్ లు ఇస్తూంటారు.

ఇప్పటికే బిగ్ బాస్ సీజన్-7 (Big Boss Season 7) ప్రోమోలు అదరగొడుతున్నాయి. సెప్టెంబర్ లో ఈ షో స్టార్ట్ కాబోతుంది. ఇందులో పాల్గొనబోయే కంటెస్టెంట్లు ఎవరా అనేదానిపై అనేక పేర్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎంతో మంది సెలబ్రిటీల పేర్లు బయటకు వస్తున్నాయి. కానీ అసలు ఇందులో ఎవరు పాల్గొంటున్నారన్న దానిపై క్లారిటీ రాలేదు. షో స్టార్ట్ అయ్యాకే ఎవరు వస్తున్నారన్నది తెలుస్తుంది. అప్పటివరకూ పలు ఊహాగానాలు వినిపిస్తూనే ఉంటాయి.

ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న బిగ్ బాస్ ఏడో సీజన్ ఎప్పుటి నుంచి మొదలు అవుతుంది అనే దానిపై ఇప్పటికే క్లారిటీ రాగా.. ఇది గతంలో ఎన్నడూ చూడని సరికొత్త ట్విస్టులు, టాస్కులు, కంటెంట్‌ తో జరగబోతుందట. ఈ సీజన్‌ ను కూడా నాగార్జునే హోస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మరో సెలబ్రిటీ పేరు తెరపైకి వచ్చింది. ఆయన ఎవరో కాదు ప్రముఖ ఆర్జే, యాంకర్ నిఖిల్.

ఈ సీజన్ లో యాంకర్ నిఖిల్ ఎంట్రీ:

నిఖిల్ (Anchor Nikhil) షోలతో పాటు పలు చిత్రాల్లో కూడా నటించాడు. దీంతో ఈ కుర్రాడి కెరీర్ సక్సెస్‌ ఫుల్‌ గా సాగుతోంది. నిహారికా కొణిదెలకు (Niharika Konidela) క్లోజ్ ఫ్రెండ్ అయిన అతడికి గతంలోనూ ఆఫర్ వచ్చింది. అయితే ఏవో కారణాలతో రాలేకపోయాడు. దీంతో ఈ సీజన్ లో నిఖిల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని తెలుస్తోంది. అలాగే నిఖిల్ కి బిగ్ బాస్ నిర్వాహకులు భారీ మొత్తం ఆఫర్ చేశారని మరో టాక్ కూడా వినిపిస్తుంది.

నిఖిల్ బిగ్ బాస్ సీజన్ 7లోకి ఎంట్రీ ఇవ్వడం దాదాపుగా ఖాయం అనే టాక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అలాగే బిగ్ బాస్ సీజన్-7లో సురేఖ వాణి కూడా ఎంట్రీ ఇస్తుందని సమాచారం. అదే జరిగితే అత్త, అల్లుడు ఇద్దరూ హౌస్ లో రచ్చ చేయం ఖాయం. గత కొంత కాలంగా సురేఖ వాణి కూతురు సుప్రీతతో నిఖిల్ డేటింగ్ చేస్తున్నాడంటూ పలు వార్తలు నెట్టింట్ జోరుగా వైరల్ అవుతున్నాయి.

Also Read: ‘తమ్ముడికి అండగా అన్న’.. మంత్రి అంబటికి ఇచ్చిపడేసిన చిరు.. మెగాస్టార్‌ ఏమన్నారంటే..?

Advertisment
తాజా కథనాలు