NIA Rides: తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాల కలకలం.. కారణమిదేనా?

ఏపీ, తెలంగాణలో ఎన్ఐఏ సోదాలు (NIA Raids) కలకలం సృష్టిస్తున్నాయి. హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, శ్రీకాకుళం, నెల్లూరు, అనంతపురం తదితర ప్రాంతాల్లోని పలువరు పౌరహక్కుల నేతల నివాసాల్లో ఈ రోజు ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు ఎన్ఐఏ అధికారులు.

NIA Rides: తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాల కలకలం.. కారణమిదేనా?
New Update

ఏపీ, తెలంగాణలో ఎన్ఐఏ సోదాలు (NIA Raids) కలకలం సృష్టిస్తున్నాయి. తిరుపతితో పాటు శ్రీకాకుళం, అనంతపురం, విజయవాడలో సోదాలు జరుగుతున్నాయి. తిరుపతిలో ప్రముఖ న్యాయవాది క్రాంతి చైతన్య ఇంట్లో ఎన్ఐఏ దాడులు నిర్వహించింది. క్రాంతి చైతన్య మావోయిస్టులతో సంబంధాలు కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. క్రాంతి చైతన్యకు ఉగ్రవాదులతో కూడా సంబంధాలు వున్నట్లు ఎన్ఐఏ అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఇంకా శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోనూ ఎన్ఐఏ దాడుల చేస్తోంది. పట్టణంలోని ముచ్చవానిపేటలో నివాసం వుంటున్న మస్కా క్రిష్ణయ్య ఇంట్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేశారు. కృష్ణయ్య ప్రస్తుతం కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

జిల్లాలో మరో ఐదుగురు పౌర సంఘాల నాయకులను కూడా ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. అనంతపురం నగరంలోనూ ఎన్ఐఏ అధికారుల సోదాల కలకలం సృష్టిస్తున్నాయి. బిందెల కాలనీలో ప్రభుత్వ ఉపాధ్యాయుడి ఇంట్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. శింగనమల మండలంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న శ్రీరాములు ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి. ప్రజా చైతన్య ఉద్యమాలు కోసం ఎరికుల శ్రీరాములు పలు రచనలు చేశారు. శ్రీరాములు ఇంట్లో నుంచి ఎవరిని బయటికి రానివ్వకుండా ఎన్ఐఏ సోదాలు చేస్తోంది. విజయవాడ పూర్ణనందంపేటలో అడ్వకేట్ టి ఆంజనేయులు ఇంట్లో ముగ్గురు సభ్యుల NIA టీమ్ విచారణ చేస్తోంది.

విప్లవ రచయితల సంఘం అధ్యక్షుడు అరసవిల్లి కృష్ణ, కార్యదర్శి రివేరా ఇళ్లలోనూ ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వమిస్తున్నారు. ఇక్కడ మాత్రమే కాకుండా హైదరాబాద్, నెల్లూరు, గుంటూరు, ప్రకాశం, రాజమండ్రిలోనూ ఎన్ఐఏ అధికారులు దాడులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. హక్కుల ఉద్యమాల్లో కీలకంగా ఉన్న నాయకులపై నిఘా పెట్టిన ఎన్ఐఏ.. ఈ రోజు తెల్లవారుజాము నుంచే వారి ఇళ్లలో దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ దాడుల్లో ఏం లభ్యమయ్యాయి, ఎన్ఐఏ అధికారులు ఏం గుర్తించారన్నది తెలియాలంటే మరికొద్ది సమయం పట్టే అవకాశం ఉంది. హైదరాబాద్ సిటీ లోని అమరుల బంధు మిత్రులు సంఘం కార్యకర్త భవాని ఇంటిపై NIA దాడులు నిర్వహించింది. విద్యానగర్ లో అడ్వకేట్ సురేష్ ఇంట్లోనూ సోదాలు చేస్తోంది.

నెల్లూరులోనూ ఎన్ఐఏ దాడులు కొనసాగుతున్నాయి. ఏపీసీఎల్సీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్లంకి వెంకటేశ్వర్లు నివాసం పై ఎన్ఐఏ దాడులు చేసింది. ఉస్మాన్ సాహెబ్ పేటలోని నివాసంలో తెల్లవారుజాము నుంచి తనిఖీలు నిర్వహిహిస్తున్నారు ఎన్ఐఏ అధికారులు. గత రెండు దశాబ్ధాలుగా పౌర హక్కుల ఉద్యమంలో ఎల్లంకి వెంకటేశ్వర్లు కీలకంగా పని చేస్తున్నారు.

మంగళగిరి మండలం నవులూరులో పచ్చల కిరణ్ ఇంట్లోనూ ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. తాడేపల్లి మహానాడులో బత్తుల రమణయ్య ఇంట్లోనూ NIA అధికారులు సోదాలు చేస్తున్నట్లు సమాచారం. బత్తుల రమణయ్య ప్రగతిశీల కార్మిక సమాఖ్య ప్రజా సంఘంలో కోశాధికారిగా పని చేస్తున్నారు.

పచ్చల కిరణ్ విప్లవ రచయితల సంఘం జిల్లా అధ్యక్షుడిగా గతంలో పనిచేసినట్లు తెలుస్తోంది.

*this is an updating story

#nia #nia-raids-in-telangana
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe