తెలంగాణకు బడ్జెట్లో అన్యాయం జరిగిందని, పది సంవత్సరాల్లో కేవలం రెండు కోట్లు మాత్రమే తెలంగాణకు కేటాయించారని అన్నారు. తెలంగాణ పట్ల భారత ప్రధాని వివక్ష చూపుతున్నాడన్నారు. విభజన చట్టంలో ఉన్న హామీలన్ని నెరవేస్తామని పార్లమెంటు సాక్షిగా అప్పటి హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ చెప్పాడు. అత్యధికంగా మన సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి నిధులు వస్తున్నాయని అన్నారు. కాజీపేటలో డివిజన్ కేంద్రం చేయాలని డిమాండ్ ఇంతవరకు చేయలేదు. స్థలాల సేకరణకు 14 ఏళ్లు పట్టింది, ఇప్పటికీ ఎన్నికల స్టంట్‌గానే వ్యాగన్ ఫ్యాక్టరీ చూడాలన్నారు. ములుగులో ట్రైబల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని స్థలాన్ని కూడా సేకరించి ఇచ్చామన్నారు. ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఎటువంటి ఏర్పాట్లు చేయలేదన్నారు.
తెలంగాణ ఉద్యమానికి ఎంత చరిత్ర ఉందో ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి కూడా అంతే చరిత్ర కలిగి ఉందని బండ ప్రకాష్ తెలిపారు. వరంగల్‌కు కేంద్రప్రభుత్వం తీరని నష్టం కలిగించిందని నిధులను పంజాబ్ రాష్ట్రానికి తరలించుకుపోయారని విమర్శించారు. విభజన చట్టంలో హామీలు ఇచ్చి తుంగలో తొక్కారన్నారు. కోచ్ ఫ్యాక్టరీ వస్తే ఎంతోమందికి ఉపాధి కలుగుతుందని అన్నారు. చిత్తశుద్ధి ఉంటే తెలంగాణకు బడ్జెట్‌లో ఎన్నడూ కూడా వందల కోట్లను కెటాయించిన పరిస్థితి లేదని అన్నారు. కేంద్రంలో తెలంగాణకు సంబంధించిన కేంద్రమంత్రి ఏం లాభమని విమర్శించారు. తెలంగాణ రాజధాని నుండి జిల్లాలకు రైల్వే కనెక్టివిటీ లేకుండా పోయింది. రాష్ట్రాన్ని అన్నివిధాల ముందుకు తీసుకెళ్లింది ఒక్క బీఆర్‌ఎస్ ప్రభుత్వం మాత్రమేనని పేర్కోన్నారు.
ఖాజీపేట రైల్వే స్టేషన్‌పై కేంద్రం వివక్ష చూపెడుతున్నారని ఈ డివిజన్ సౌత్‌లోనే అత్యధిక ఆదాయాన్ని కలిగి ఉందని పేర్కొన్నారు. ఖచ్చితంగా ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీని ఇవ్వాలని కోరారు. పెట్టుబడులన్ని కేంద్రప్రభుత్వం ఏపీలోని విజయవాడకు తరలించారని తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ తెలిపారు. అంతేకాకుండా బీజేపీ ప్రభుత్వం పస్ట్ నుంచి తెలంగాణకు తీరని నష్టం కలిగించిందని, తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం చేసిందేమిలేదని దీనిలో భాగంగా తెలంగాణపై కేంద్రం తప్పుడు ఆరోపణలు చేస్తూ లేనిపోని బురద జల్లే ప్రయత్నం చేస్తుందన్నారు.