శ్యామ్‌ చెల్లెలి బాధ్యత మాది.. 'రా ఎన్టీఆర్‌' స్వచ్ఛంద సంస్థ..!

అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని శ్యామ్ కుటుంబానికి తారక్ అభిమానులు అండగా నిలుస్తున్నారు. శ్యామ్‌ ఆత్మహత్య చేసుకోలేదని, ఎవరో చంపేశారని ఆరోపిస్తున్న ఎన్టీఆర్ అభిమానులు. శ్యామ్ మృతి విషయంలో ఏపీ పోలీసులు విచారణ జరపి, దోషులను శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే, శ్యామ్ చెల్లెలి బాధ్యత తమదేనంటూ ఎన్టీఆర్ పేరిట ఆయన అభిమానులు నెలకొల్పిన ఒక స్వచ్ఛంద సంస్థ ముందుకొచ్చింది.

శ్యామ్‌ చెల్లెలి బాధ్యత మాది.. 'రా ఎన్టీఆర్‌' స్వచ్ఛంద సంస్థ..!
New Update

news-jr-ntr-fan-shyam-died-in-suspectable-manner-in-andhra-pradhesh-outrage-in-social-media

ఎన్టీఆర్ అభిమానులు కొంతమంది కలిసి‘RAW NTR’అనే స్వచ్ఛంద సంస్థను సుమారు మూడేళ్ల క్రితం నెలకొల్పారు. ఎన్టీఆర్ మాటల స్ఫూర్తితో ఈ స్వచ్ఛంద సంస్థను నెలకొల్పినట్లు ఆయన అభిమానులు చెబుతుంటారు. అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని శ్యామ్ కుటుంబానికి తారక్ అభిమానులు అండగా నిలుస్తున్నారు. అలాంటి సంస్థ ఇప్పుడు శ్యామ్ కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించింది. పోయిన ప్రాణాన్ని ఎలాగూ తిరిగి తీసుకురాలేము. కానీ, శ్యామ్ కుటుంబానికి మేము అండగా నిలుస్తాం. ఇప్పటికే శ్యామ్ తల్లిదండ్రులతో మాట్లాడాం. వాళ్లకి అన్ని విధాలుగా ధైర్యాన్ని ఇచ్చామంటూ భరోసానిచ్చారు.

శ్యామ్ తన కుటుంబానికి అండగా ఉంటాం: RAW NTR

శ్యామ్ తన కుటుంబానికి వెన్నెముక లాంటోడు. తను లేని లోటు ఆ కుటుంబానికి మనమెవ్వరం తీర్చలేనిది. అందుచేత, శ్యామ్ చెల్లెలి పెళ్లి బాధ్యత మేము తీసుకున్నాం. అలాగే, జరిగిన సంఘటన మీద పోలీసు శాఖను స్పష్టమైన దర్యాప్తు చేయమని కోరుతున్నామని RAW NTR పేరుతో ట్యాగ్‌ చేస్తూ ఒక ప్రకటనను విడుదల చేసింది. ఎన్టీఆర్‌ తన కుటుంబానికి అన్ని విధాల అండగా నిలుస్తామని రా ఎన్టీఆర్ స్వచ్చంధ సంస్ధ తెలిపారు. శ్యామ్ మృతి విషయంలో ఏపీ పోలీసులు లోతైన విచారణ జరపాలని, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

రాజకీయ రగడ:

శ్యామ్‌ మృతిపై విచారణ జరపాలంటూ సోషల్ మీడియా క్యాంపైన్ డిమాండ్ చేసింది. వుయ్ వాంట్ జస్టీస్ ఫర్ శ్యామ్ ఎన్టీఆర్ అంటూ హ్యాష్ ట్యాగ్ చేశారు. ట్వీట్స్ షేర్ చేసిన సినీ రాజకీయ ప్రముఖులు. టిడిపికి కౌంటర్ ఇస్తూ సజ్జల బార్గవ్ రెడ్డి ట్వీట్ కాస్త వైరల్‌ అవుతోంది. శ్యామ్ సూసైడ్ చేసుకునే ముందు తన ఫోన్ లో రికార్డ్ చేసిన వీడియోను సజ్జల బార్గవ్ షేర్ చేశారు. దీనికి రాజకీయ రంగు పులిమి నీచ రాజకీయాలు చేస్తోందని టీడీపీ భావిస్తోంది. 40 ఏళ్ల ఇండస్ట్రీ ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకో.. నీచ రాజకీయాలు మానుకో అంటూ సజ్జల బార్గవ్ ట్వీట్ కాస్త రాజకీయంగా తీవ్ర చర్చకు దారి తీస్తోంది.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe