స్మార్ట్ ఫోన్ కొన్నవారికి 2 కిలోల టమాటాలు ఫ్రీ.. అంటున్న షాపు యజమాని

టమాటా ధరలు రాకెట్ కంటే వేగంగా దూసుకెళ్తున్నాయి. టమాటా ధరలను చూసిన సామాన్యులకు పట్టపగలే చుక్కలు చూపెట్టడంతో వారు కొనలేక భయపడి వెనకడుగు వేస్తున్నారు. దేశంలో టమాటా గరిష్ఠంగా రూ. 250 పలుకుతుండగా.. కనిష్ఠంగా రూ.100 గా ఉంది. హైదరాబాద్‌ నగరంలో ఐతే కిలో టమాటా రూ. 90 నుంచి రూ. 130 వరకు పలుకుతోంది. అదే బెంగళూరులో కిలో టమాటా రూ.101 నుంచి రూ.130 పలుకుతుండగా.. ఇక కోల్‌కత్తాలో రూ.150, ఢిల్లీలో రూ.120, ముంబైలో రూ.120 గా ఉంది.

New Update
స్మార్ట్ ఫోన్ కొన్నవారికి 2 కిలోల టమాటాలు ఫ్రీ.. అంటున్న షాపు యజమాని

టమాటా ధరలు భారీగా పెరగడంతో రెస్టారెంట్‌లు సైతం ముందడుగు వేసి టమాటా వినియోగాన్ని పూర్తిగా తగ్గిస్తున్నాయి. టమాటా ధరలు పెరగడానికి గల కారణం ఏంటంటే.. దిగుబడి తగ్గడం ప్రధాన కారణంగా చెబుతున్నారు అమ్మకందారులు. ఈ ధరల మోత మరో 2 నెలల పాటు ఇలాగే కొనసాగే అవకాశం ఉందంటూ తెలిపారు. అప్పటివరకు ఓపికతో మనం వండే వంటల్లో కొంచెం మంటను తగ్గించి టమాటా వినియోగాన్ని తగ్గిస్తేనే టమాటా ధరలు దిగొస్తాయని తెలిపారు. అంతేకాదు టమాటాను కొన్నిరోజులు వాడకపోవడమే మంచిదని సామాన్యులు అనుకుంటున్నారు.

మొబైల్ షాప్ నిర్వహకుడు వినూత్న ఆలోచన

news-india-a-mobile-shop-in-madhya-pradesh-is-giving-two-kilos-of-tomatoes-as-a-gift-if-they-buy-a-smart-phone-viral-news

అయితే ఇదంతా ఇలా ఉంటే.. ప్రస్తుతం టమాటా దొరకడం కష్టంగా మారిన తరుణంలో ఓ మొబైల్ షాప్ నిర్వహకుడు మాత్రం వినూత్నంగా ఆలోచన చేశాడు. తన షాపులో స్మార్ట్ ఫోన్ కొన్నవారికి 2 కిలోల టమాటాలు ఉచితంగా ఇస్తున్నాడు. ఇంతకీ ఇదెక్కడంటే.. మధ్యప్రదేశ్‌లోని అశోక్ నగర్ మొబైల్ షోరూమ్‌లో స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసే కస్టమర్‌లకు 2 కిలోల టమాటాలను బహుమతిగా అందిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేస్తే 2 కిలోల టమాటాలు బహుమతిగా ఇస్తున్నట్లు మొబైల్ దుకాణదారుడు అభిషేక్ అగర్వాల్ చెప్పారు. అంతేకాదు ఈ పథకం ప్రారంభించిన వెంటనే క్రమక్రమంగా కస్టమర్ల సంఖ్య పెరుగుతోందని, దీని కారణంగా, మేము ఎక్కువ మొబైల్‌లను విక్రయిస్తున్నామని ఆనందం వ్యక్తం చేశారు.

టమాటాపై మీమ్స్

అదే సమయంలో టమాటాలు ఉచితంగా అందించడంతో కస్టమర్లు సైతం సంతోషంగా ఉన్నారని షాపు ప్రొప్రెటర్ చెప్పారు. కొద్ది రోజుల క్రితం కర్ణాటకలో టమాటా దొంగతనం జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా టమాటా పై మీమ్స్ నడుస్తున్నాయి. ఇక్కడ అసలు విషయమేమింటే.. ఒక్క టమాటా ధరలే కాదు పచ్చి మిర్చి ధరలు కూడా భారీగానే ఉన్నాయి. కిలో పచ్చి మిర్చి రూ.100 నుంచి రూ.120 పలుకుతుంది. మిగతా కూరగాయల ధరలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. విరివిగా ఉపయోగించే ఉల్లిపాయ రేట్లు కూడా రోజురోజుకి పెరిగిపోతున్నాయి. అటు చికెన్, ఇటు గుడ్ల ధరలు కూడా పెరుగే ఛాన్స్‌ ఉండటంతో వినియోగదారులు ఎక్కువ మోతాదులో కొనుగోలు చేసి ఇంట్లో నిల్వ చేసుకుంటున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు