తాను పదేళ్ల నుంచి పార్టీ కోసం పని చేస్తున్నా, నేనెందుకు అధ్యక్ష పదవికి అర్హుడిని కాదు? అని ప్రశ్నించారు రఘునందన్.. కొన్ని విషయాల్లో నా కులమే నాకు శాపం కావచ్చు అంటూ ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. రెండు నెలల్లో బీజేపీ ఎలా ఉంటుందో అందరికీ తెలుస్తుందన్నారు.. రెండో సారి దుబ్బాక నుంచి ఎమ్మెల్యే గా గెలుస్తా అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. నేను పార్టీలో ఉండాలని అనుకుంటున్నా అని స్పష్టం చేశారు.. 100 కోట్లు ఖర్చుపెట్టినా మునుగోడులో గెలవలేదు.. అదే 100 కోట్లు నాకిస్తే తెలంగాణను దున్నేసేవాణ్ణి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దుబ్బాకలో నన్ను చూసే గెలిపించారు.కేసీఆర్‌ను కొట్టె మొగోణ్ణి నేనేనని జనాలు నమ్మారని.. అంతేకాని బీజేపీని చూసి కాదు అంటూ తేల్చేశారు.
నాకు పదవి ఇవ్వకపోతే వెళ్లిపోతా.. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ హాట్ కామెంట్స్..!
తెలంగాణ బీజేపీలో రోజుకొక కథ తెరముందుకొస్తుంది. అధ్యక్షుడిని మార్చేస్తారంటూ.. ప్రస్తుత అధ్యక్షుడిని సెంట్రల్లో ఉపయోగించుకుంటారంటూ.. ఇలా రకరకాల ప్రచారాలు... కొంతమంది కీలక నేతలు అలిగితే..! మరికొందరు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అలాంటి వ్యక్తుల్లో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఒకరు. అయితే, ఢిల్లీలో ప్రత్యక్షమైన ఆయన.. బీజేపీలో పరిస్థితులపై హాట్ కామెంట్లు చేశారు. తనకు పార్టీలో సరైన గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మూడు పదవుల్లో ఏదో ఒక పదవి ఇవ్వాల్సిందే అనే తరహాలో స్పష్టం చేశారు.
Translate this News: