వివాహిత ప్రాణాన్ని బలిగొన్న మిస్డ్‌ కాల్‌

ప్రస్తుతం సమాజంలో అక్రమ సంబంధాల కారణంగా కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. ఆనందంగా సాగుతున్న జీవితాల్లో చిచ్చు పెట్టి ఆగమాగం చేస్తున్నాయి. రత్నాల్లాంటి పిల్లలను కాదనుకొని పరాయి స్త్రీ లేదా పురుషుడి మోజులో పడి కొందరు తమ దాంపత్య జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నారు. తాజాగా వరంగల్‌ జిల్లాలో ఓ మిస్డ్ కాల్ వ్యవహారం.. కాస్త వివాహిత ప్రాణం తీసింది. దీంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడింది.

వివాహిత ప్రాణాన్ని బలిగొన్న మిస్డ్‌ కాల్‌
New Update

news-a-missed-call-incident-in-warangal-district-claimed-the-life-of-a-married-women1

దేశంలో రోజురోజుకి అక్రమ సంబంధాల కారణంగా ఆ కుటుంబాలన్ని రోడ్డున పడే పరిస్థితి నెలకొంది. ఈ అక్రమ సంబంధాల మూలంగా పచ్చగా సాగుతున్న సంసారాల్లో అగ్గిని పుట్టిస్తున్నాయి. భార్యాభర్తలు ఏ ఒక్కరి విషయంలోనైనా.. అక్రమ సంబంధం బయటపడితే.. అది తీవ్రమైన పరిణామాలకు దారి తీస్తుంది. అంతేకాదు విడాకులు తీసుకునే స్థాయికి చేరుకుంటున్నాయి. దీంతో కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి నెలకొంది.

తాజాగా.. వరంగల్‌ జిల్లాలో జరిగిన ఘటన తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. వరంగల్‌ పట్టణంలోని కరీమాబాద్‌లో జరిగిన ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ప్రైవేట్ కళాశాలలో పనిచేస్తున్న వివాహిత ఆకుతోట సౌజన్య గతకొన్ని నెలల క్రితం ఓ మిస్డ్ కాల్ రావడంతో ఆ మిస్ కాల్‌కి రిప్లై ఇచ్చింది. దీంతో సదరు వ్యక్తితో మాటామాటా కలిపి పరిచయం ఏర్పరచుకుంది.

అయితే... కొద్దిరోజుల తర్వాత తన కోరిక తీర్చమని సదరు మహిళను తిరుపతి వేధించసాగాడు. వివాహితకు కాల్ చేసిన తిరుపతి తాను చెప్పినట్లు వినాలని లేదంటే వీడియోలు కుటుంబ సభ్యులకు పంపిస్తానని వేధించాడు. అతడి వేధింపులతో ఆమె తీవ్ర ఆందోళనకు గురైంది. దీంతో ఈ వేధింపులు భరించలేక వివాహిత గురువారం ఇంట్లోని సంపులో దూకి ఆత్మహత్యయత్నం చేయగా.. గమనించిన కుటుంబసభ్యులు హుటాహుటిన ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆకుతోట సౌజన్య మృతి చెందింది. ఆమె కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe