New Year 2024 Party: న్యూ ఇయర్ వచ్చేసింది. ఇప్పుడు ఏ నోట విన్నా పార్టీ లేదా పుష్పా అనే మాటే . కొందరు ప్రయివేట్ పార్టీలు ప్లాన్ చేసుకుంటే కొంతమంది పబ్బుల్లో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఏదేమయినా సరయిన జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం చిక్కుల్లో పడతారు,.
లా అండ్ ఆర్ధర్ క్రాస్ చేస్తే చర్యలు తప్పవు
సాయంత్రం 6 గంటలకు పార్టీ షురూ చేసి తెల్లవారు జామువరకో .. అర్ధరాత్రి సెలబ్రేషన్స్ అయిన వరకో కంటిన్యూ చేసి అప్పుడు ఇంటికి వెళ్లాలంటే ఇప్పుడున్న లా అండ్ ఆర్ధర్ ప్రకారం చిక్కులు తప్పవు. చుక్కపడితే బిహేవియర్ మారిపోతుంది. ఈ ఒక్కరోజే కదా మనల్ని ఆపేదెవరు ? అని మొండికేస్తే తరువాత జరిగే పరిణామాలు దారుణంగా ఉంటాయి. ఇలాంటి విపత్కర పరిస్థితులను అధిగమించి న్యూ ఇయర్ లో హ్యాపీగా ఉండాలంటే మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.
పబ్స్ కు వెళ్లేవారికి ముఖ్య గమనిక
మన ఇంటినుంచి పార్టీ చేస్కునే ప్రాంతానికి దూరం ముందే తెలుస్తుంది కాబట్టి ..సొంత బైక్స్ మీద కార్లలో వెళ్లకుండా సేఫ్ గా క్యాబ్ బుక్ చేసుకుంటే బెటర్. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో తప్పని సరిగా సెల్ఫ్ డ్రైవింగ్ అవాయిడ్ చేయండి. ఇక.. చుక్కపడితే ఎదుటివాళ్ళకు చుక్కలుచూపించే మహానుభావులు కొంతమంది ఉంటారు. వాళ్ళు మాత్రం అత్యుత్సాహం ప్రదర్శించకుండా కాస్త జాగ్రత్త వహించడం మంచిది. ఇక.. ప్రయివేట్ పార్టీలలో పాల్గొనే వాళ్ళు పార్టీ చేసుకునే ప్రాంతాల్లో రూమ్ ఏర్పాట్లు చేస్కోవడం చాలా ఉత్తమం. పబ్స్ ను ఎంచుకునే ముందు ఆ పబ్ నేపథ్యం ఏంటి ? ఇంతకు ముందు ఆయా పబ్స్ లో డ్రగ్స్కు సంబంధించిన ఇస్స్యూస్ ఏమయినా జరిగాయా ? అనే విషయాలను ఒకటికి రెండు సార్లు తెలుసుకుని వెళ్ళండి..ఇక.. పార్టీ జోష్లో చిన్న చిన్న గిడవలు చిలికి చిలికి గాలివానలా మారుతాయి. నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే స్టేజ్ కి వెళ్లిపోతాయి. కొన్ని విషయాల్లో తగ్గి ఉండటమే బెటర్. కాస్త వెనకడుగు వేస్తె పోయేదేముంది. ముఖ్యoగా గర్ల్ ఫ్రెండ్స్ తో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తలు వహించాలి. ఎవడో ఒకడు రెచ్చగొట్టే మాటలు అన్నారని రెచ్చిపోతే తరువాత చాలా పరిణామాలు ఎదురౌతాయి.
మద్యం అలవాటులేకపోయినా
కొంతమంది పాపం ఎలాంటి మద్యం తీసుకోకుండానే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ రోడ్లపై జరుపుకుంటారు. కేక్స్ కట్ చేసి.. క్రాకర్స్ వెలిగిస్తూ చాలా హంగామా చేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు గమనించాల్సింది చాలా ఉంది. మన ప్రవర్తస ఎదుటివారికి ఇబ్బంది పెట్టే విధంగా ఉంటే మాత్రం ఇబ్బందుల్లో పడతారు. ఇక..బైక్స్ రైడింగ్స్ తో రాత్రి 12 గంటలప్పుడు చాలా హంగామా చేస్తూ ఉంటారు. .వాళ్లకు జరిగే ప్రమాదాలు ఓ ఎత్తు అయితే .. ఇలాంటి వారి కారణంగా చాలా మంది ప్రమాదాలకు గురవుతారు. కాబట్టి ఇలాంటి బైక్ రైడింగ్స్ మానుకోవడమే బెటర్.
ALSO READ:HAPPY NEW YEAR 2024 న్యూ ఇయర్లో ఇలా చేయండి.. ఖచ్చితంగా మీ సంతకం ఆటోగ్రాఫ్ అవడం ఖాయం
ఆనందాన్ని ఎవరు కాదంటారు
ఆనందాన్ని ఎవరు కాదంటారు,.కాకపోతే హద్దులు మీరితేనే ప్రమాదం.ఇక.. రాత్రంతా పార్టీ మోడ్ లో ఉండి జనవరి ఫస్ట్ న ఆఫీస్ లకు వెళ్లేవారు కాస్త తమ ఎంజాయిమెంట్స్ కు లాక్ చెయ్యకతప్పదు. ఎందుకంటే మనం హ్యాపీగా ఉండాలంటే జాబ్ కూడా ఇంపార్టెంట్ కదా . అందుకే కాస్త టైం ప్రకారం పార్టీ ముగిస్తే మంచిది. ఇక .. ఇవన్నీఈ మనకు అవసరమా .. హాయిగా ఫ్యామిలీతో న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకుందామంటే అంతకుమించిన ఆనందం కొన్ని వేలకోట్లు ఇచ్చినా దొరకదు. మనం ఏ పని చేసినా మన మీద ఆధారపడ్డ ఇంట్లో వాళ్ళను , మనమీద ఆశలు పెట్టుకున్నవారిని నమ్మకాన్ని వమ్ముచేయకూడదు. మరీ మడికట్టుకుని కూర్చొమని చెప్పడం లేదుకానీ .. కల్చర్ పేరుతో హద్దులు దాటితే మొదటికే మోసం వస్తుంది. ఇప్పుడున్న టెక్నాలజీతో అడుగడుగునా సిసి కెమెరాలు ఉన్నాయి. జరబద్రం. సో.. ఈ న్యూ ఇయర్ అంతా మంచే జరగాలని కోరుకుంటూ .. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్.
ALSO READ:Vishwak Sen: డ్రగ్స్ బ్యాక్ డ్రాప్ లో విశ్వక్ సేన్ ‘#కల్ట్’movie