Whatsapp Status: ఇకపై వాట్సాప్ 'స్టేటస్' లను చూడటమే కాదు లైక్ కూడా చేయొచ్చు...

వినియోగదారుల కోసం వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్, అప్ డేట్స్ ను తీసుకువస్తోంది. అందులో భాగంగానే తాజాగా, వాట్సాప్ స్టేటస్ లను ‘లైక్’ చేసే విధంగా ఒక కొత్త అప్ డేట్ ను తీసుకొచ్చింది. ఈ అప్ డేట్ ఇన్ స్టా గ్రామ్ రీల్స్ తరహాలో ఉండనుంది.

Whatsapp New Feature: వాట్సాప్ లో కొత్త ఫీచర్లు!
New Update

Whatsapp Status New Feature: వాట్సాప్ ఎప్పుడూ వినియోగదారుల అవసరాలకు తగ్గట్టు కొత్త ఫీచర్స్, అప్‌డేట్స్ అందిస్తూ ఉంటుంది. తాజాగా, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌ తరహాలో వాట్సాప్ స్టేటస్‌లకు(Whatsapp Status) ‘లైక్’ చేసే కొత్త ఫీచర్ తీసుకొచ్చింది.

ఇది ఇన్‌స్టాగ్రామ్ స్టోరీల లైక్ లాగా, వాట్సాప్ స్టేటస్‌లకు కూడా లైక్ చేసే అవకాశాన్ని ఇస్తుంది. మీ స్టేటస్‌ని లైక్ చేయాలంటే, స్క్రీన్ కింద ఎడమ వైపున ఉన్న హార్ట్ ఎమోజీని నొక్కాల్సి ఉంటుంది. లైక్ చేసిన వారిని కూడా చూడొచ్చు. ఈ ఫీచర్ స్టేటస్‌ను చాట్ ప్రారంభించకుండా చూసే అవకాశం ఇస్తుంది.

స్టేటస్ లైక్స్, చాట్ సంభాషణలతో ముడిపడకుండా ఉంటాయి, అంటే ఈ లైక్స్ మామూలు చాట్ మాదిరి కాకుండా ఉంటాయి. చాట్ ద్వారా స్టేటస్‌లకు స్పందించడం సాధ్యం కాని, లైక్ లేదా లవ్ సింబల్ ద్వారా స్టేటస్‌లకు స్పందించవచ్చు.

ప్రస్తుతం ఈ ఫీచర్ అందరికీ లభ్యమవ్వనప్పటికీ, తాజా వాట్సాప్ బీటా వెర్షన్ 2.24.17.21 ఇన్‌స్టాల్ చేసిన యూజర్లు దీనిని ఉపయోగించవచ్చు. వచ్చే వారాల్లో ఈ అప్‌డేట్ రెగ్యులర్ యూజర్లకు అందుబాటులో రానుంది. అదనంగా, వాట్సాప్ చాట్ బాట్ ద్వారా రియల్ టైమ్ వాయిస్ చాట్‌లను కూడా అందించడానికి కొత్త ఫీచర్‌ను అభివృద్ధి చేస్తున్నట్టు సమాచారం.

#whatsapp-status
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి