Cyber Crime: సైబర్ నేరగాళ్ల కొత్త రూటు..భారత్ గ్యాస్ అంటూ ఫోన్లు

ఒకప్పుడు దోపిడీలు, దొంగతనాలంటే హడలిపోయిన ప్రజలు.. ఇప్పుడు అంతకంటే ప్రమాదకర సైబర్ నేరాలతో బెంబేలెత్తుతున్నారు. మరోవైపు సైబర్ నేరగాళ్ళు కడా కొత్త కొత్త దారుల్లో నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా భారత్ గ్యాస్ నుంచి అంటూ ఫోన్లు రావడం కలకలం రేపింది.

New Update
Cyber crime: క్రెడిట్ కార్డు పేరిట యువతిని నట్టేటా ముంచిన సైబర్ కేటుగాళ్లు.. ఎంత దోచేశారంటే!

ఆన్‌లైన్‌ ట్రాన్‌సాక్షన్‌ల సంఖ్య పెరిగింది. వివిధ రకాల వస్తువుల కొనుగోలుకు ఆన్‌లైన్ మాధ్యమాలపై ఆధారపడటం పెరగడంతో సైబర్‌ మోసాలు తీవ్రమయ్యాయి.డిజిటలైజేషన్ యుగంలో ఆన్‌లైన్ బ్యాంకింగ్ అవసరాలతో పాటు సైబర్ మోసాల ముప్పు కూడా పెరుగుతోంది. ఈ మధ్య కాలంలో ఈ సైబర్ నేరాల సంఖ్య మరీ ఎక్కువైపోతోంది. దాంతో పాటూ సైబర్ నేరగాళ్ళ తెలివి తేటలు కూడా రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. జనాల దగ్గర డబ్బులు దోచుకోవడానికి కొత్త కొత్త మార్గాలు కనిపెడుతున్నారు.

రోజురోజుకీ టెకాల్నజీ కొత్త పుంతలు తొక్కుతుంటే..మరోవైపు ఆన్‌లైన్‌ మోసాలు కూడా అదే స్థాయిలో జరుగుతున్నాయి. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలంటూ పోలీసులు ఎంత అవగాహన కల్పించినా లాభం లేకుండా పోతోంది. సైబర్ నేరం చేసే వాళ్ళు కూడా ఒకదారి మూసుకుపోతే మరోదారిలో మోసం చేయడానికి రెడీ అవుతున్నారు.తాజాగా భారత్ గ్యాస్ నుంచి ఫోన్ చేస్తున్నాం అంటూ వినియోగదారులకు ఫోన్లు చేస్తున్నారు మోసగాళ్ళు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా.. మనకొండూరు నియోజకవర్గంలోని ఓ గ్రామంలో వందలాది మందికి ఒక్క గురువారం రోజునే ఫోన్లు వచ్చాయి. 5 లక్షల లోన్ మంజూరు అయ్యిందని.. OTP చెప్పాలని అడిగారు. దీని ద్వారా ఫోన్ నంబర్లు, బ్యాంకు అకౌంట్ వివరాలు తెలుసుకునేందుకు ప్లాన్ వేశారు. అయితే అసలు నిజం తెలుసుకునేందుకు ఏజెన్సీకి ఫోన్ చేస్తే అలాంటిది ఏమీ లేదని నిర్వాహకులు చెప్పడంతో చాలా మంది అలర్ట్ అయ్యారు. ఇందులో ఎంత మంది మోసపోయారో ఇంకా తెలియలేదు. దీని గురించి అటు గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు, ఇటు ప్రజలు కూడా పోలీసులకు కంప్లైంట్ చేశారు.

Also Read:T20 World Cup: సూపర్ 8లో చెలరేగిన భారత్..ఆఫ్ఘాన్ మీద విజయం

Advertisment
తాజా కథనాలు