New Technology: 26 గంటల్లోనే ఇంటి నిర్మాణం...సిమెంట్, ఇటుకలు అక్కర్లేదు

సొంత ఇంటి కోసం రకరకాల కలలు కంటూ ఉంటారు. ఎలా నిర్మించుకోవాలి..? డిజైన్, ఖర్చు అనేది ముందుగానే అంచనా వేస్తారు. అంతా ఖర్చుపెట్టి కట్టిన ఇంటికి ప్రకృతి వైపరీత్యానికి ఉంటాయో ఉండవో తెలియదు కానీ..ఈ ఇళ్లు మాత్రం భూకంప దాటితోపాటు ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే శక్తి కలిగి ఉంది.

New Technology: 26 గంటల్లోనే ఇంటి నిర్మాణం...సిమెంట్, ఇటుకలు అక్కర్లేదు
New Update

house Construction: టెక్నాలజీ అభివృద్ధి చెందిన తర్వాత మనం చేసుకునే పనులు చాలా తేలికగా అయ్యాయి. పూర్వంలో ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అనే సామెత మన పెద్దవాళ్లు అంటూ ఉంటారు. అయితే మనిషి జీవితంలో ఈ రెండు పనులు చేయడం అంత తేలికైన వ్యవహారం కాదు. చాలామందికి సొంతంగా ఇల్లు కట్టుకోవాలని కలలు కంటూ ఉంటారు. అయితే ఆ కల నెరవేర్చుకోవడం అంత చిన్న పని కాదు. ఎన్నో వ్యయప్రయాసలతో ఇల్లు నిర్మాణం ఉంటుంది. అయితే.. ఇప్పుడు అలాంటి శ్రమ లేకుండా కొత్త టెక్నాలజీ మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి. భారత్ నిర్మాణ రంగంలో త్రీ డైమెన్షనల్ ప్రింటింగ్ అనే కొత్త టెక్నాలజీ మార్కెట్లోకి వచ్చి చేరిన విషయం తెలిసిందే. అయితే.. దీంతో ఇటికలు, సిమెంట్‌, తాపీ మేస్త్రీలు అవసరం లేకుండానే ఇంటి నిర్మాణం పూర్తవుతుంది. దీనికి స్థలం ఉంటే చాలు అందమైన ఇల్లు కష్టం లేకుండానే మీ సొంతమైపోతుంది.  మొట్టమొదటి 3డీ ప్రింటింగ్ ఇంటిని ప్రముఖ సిమెంట్ కంపెనీ ప్రోగ్రెసో నిర్మించింది. ఫోటో టైప్ డిజైన్‌తో భూకంపం లాంటి ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా ఈ ఇంటిని నిర్మాణం డిజైన్ చేశారు. దీని స్పెషాలిటీ ఏమిటంటే.. 49 స్క్వేర్ ఫీట్ లో ఇల్లు ఉటుంది.

ధర తక్కువగా..వేడిగా

మార్కెట్లో టెక్నాలజీ పెరిగిన కొద్దీ మనం చేసుకునే పనులు చాలా ఈజీగా అయిపోతున్నాయి. 26 గంటల్లో ఇల్లు రెడీ అయిపోతుంది. 26 గంటలు ఇల్లు రెడీ అవ్వటం ఆశ్చర్యంగానే ఉంటుంది కదా. సీఓబీఓడీ ప్రింటర్‌ను ఉపయోగించి రీసెంట్‌గా బెంగళూరులో పోస్ట్ ఆఫీస్ ఏర్పాసింది 3డీ డైమెన్షనల్ ప్రింటింగ్  టెక్నాలజీ. ఈ రకమైన నిర్మాణం సాధారణంగా లాటిన్ అమెరికాలో ఎక్కువగా వాడే వారట. ధర తక్కువగా ఉండటంతో పాటు ఇంటిని కాస్త వేడిగా ఉంచుతోంది. ఈ 3డీ ప్రింటింగ్ నిర్మాణం ముఖ్యంగా భూకంపాల తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు బాగా సరిపోతుందని చెబుతున్నారు.

ఇంటి ప్రింటింగ్‌ ప్రారంభించే ముందు

ఈ 3డీ ప్రింటింగ్‌ నిర్మాణంలో యంత్రం నిర్మాణ పని చేస్తుంది. ఇంటిని ఎక్కడ కట్టాలో నిర్ణయించాక, అవసరమైన ప్లాన్‌ వేస్తారు. మోడలింగ్‌ సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామ్‌ ద్వారా గోడలు, గదులు ఎలా ఉండాలో ప్లాన్‌ చేసి కంప్యూటర్‌ సాయంతో 3డీ ప్రింటర్‌కు పంపిస్తారు. ఇంటి ప్రింటింగ్‌ ప్రారంభించే ముందు.. బిల్డ్‌ మిశ్రమాన్ని వేసేందుకు యంత్రం రోబోటిక్‌ హ్యాండ్‌ కదిలేందుకు వీలుగా అమరుస్తారు. అన్నీ సరిచూసుకున్నాక యంత్రానికున్న ‘ప్రింట్‌’ బటన్‌ ఆన్‌ చేయగానే ప్రింటర్‌ దానికదే ప్లాన్‌ ప్రకారం నిర్మాణాలన్నీ ప్రారంభించి కిటికీలు, గోడలు, వెంటిలేటర్లు వంటివి పూర్తిచేస్తుంది. ప్రింటర్‌లోని నాజిల్‌ ద్వారా కాంక్రీట్‌ మెటీరియల్‌ బయటకు వస్తే.. మరో కాంక్రీట్‌ డ్రయర్‌ నిర్మాణ సామగ్రిని పటిష్టం చేసి..మరో పొర కాంక్రీట్‌ వేస్తుంది. ప్లాన్‌లో ఉన్నట్టుగా ఇలా పొరలు పొరలుగా ఇంటి నిర్మాణం పూర్తవుతుంది. తరువాత ఆపై తలుపులు, ప్లంబింగ్, కిటికీలు, ఎలక్ట్రికల్‌ వైరింగ్‌ పనులన్ని కార్మికులు చేస్తారు.

ఇది కూడా చదవండి: సబ్బును కేక్‌లా తిన్న చిన్నది..అసలు విషయం తెలిసి షాకైన జనం

#construction #house-within-26-hours #new-technology
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe