China Wall : వేల సంవత్సరాలు గడిచినా చైనా వాల్ ఎందుకు చెక్కు చెదరలేదంటే!

ఇన్ని వేల సంవత్సరాలైనా చైనా వాల్ చెక్కు చెదరకపోవడానికి కారణాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. గోడ నిర్మాణాన్ని చేపట్టిన సమయంలో బయోక్రస్టులు అనే పదార్థాలను ఉపయోగించినట్లు వెల్లడించారు.

New Update
China Wall : వేల సంవత్సరాలు గడిచినా చైనా వాల్ ఎందుకు చెక్కు చెదరలేదంటే!

China Wall : ఏడు ప్రపంచ వింతల్లో(7 Wonders Of The World) ఒకటైనా చైనా వాల్‌ గురించి అందరికీ తెలిసిందే. అంతరిక్షం నుంచి భూమి మీద కనపడే ఏకైక కట్టడం ఏదైనా ఉంది అంటే అది గ్రేట్‌ వాల్‌ ఆఫ్‌ చైనా అని చెప్పవచ్చు. అలాంటి గ్రేట్‌ వాల్‌ ఆఫ్‌ చైనా ని ఎప్పుడు నిర్మించారు, ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఆ గోడ ఎందుకు అంత దృఢంగా ఉంది అనే విషయాల గురించి ఈ కథనంలో తెలుసుకోండి.

చైనా వాల్‌(China Wall) ని సుమారు 3 వేల సంవత్సరాల క్రితం చైనా చక్రవర్తులు నిర్మించినట్లు తెలుస్తుంది. ఈ చైనావాల్‌ నిర్మాణం కానీ, దాని చుట్టూ ఉన్న భౌగోళిక పరిస్థితుల వల్ల ప్రపంచ దేశాల చూపు ఆ గోడ మీద పడింది. దాంతో దానిని చూడటానికి ప్రపంచ నలుమూలల నుంచి కూడా సందర్శకులు వస్తుంటారు.

ఎందుకు చెక్కుచెదరలేదు అంటే..

అసలు ఇన్ని వేల సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా చైనా వాల్‌ ఎందుకు చెక్కుచెదరలేదు అనే విషయం ఆర్కియాలజిస్టుల(Archeologist) మైండ్‌ ని తోలుస్తుంది. దీంతో వారు ఆ దిశగా ఆలోచించడం మొదలు పెట్టారు. అసలు దీనిని ఎలా నిర్మించారు అనే దాని మీద ప్రయోగాలు మొదలు పెట్టారు కూడా.

ఇందుకోసం నార్తెన్‌ అరిజోనా యూనివర్సిటీ రీసెర్చ్‌ విభాగంలోని ప్రొఫెసర్‌ బౌకర్‌ నేతృత్వంలోని ప్రత్యేక బృందం అసలు ఇందులోని మర్మం ఏమిటి అనేదానిని కనుగొనడానికి రంగంలోకి దిగింది. ఈ క్రమంలోనే చైనా వాల్‌ పొడవునా 480 కిలో మీటర్ల మేర శాంపిల్స్‌ సేకరించింది. పైగా ఆ వాల్‌ మీద మూడు వంతులు బయోక్రస్టుతో కప్పబడి ఉందని గుర్తించింది.

గోడను నిర్మించే క్రమంలో నేలలోకి నేచురల్‌ మెటీరియల్స్‌ తో కుదించడం ద్వారా ఈ గోడ నిర్మించడం జరిగిందని పరిశోధకులు కనుగొన్నారు. అయితే గోడ కట్టే సమయంలో చాలా ఇబ్బందులు కూడా తలెత్తాయని ఆ సమయంలో వాల్‌ క్షీణించకుండా సహజ రక్షణ రేఖను అప్పటి నిపుణులు అభివృద్ధి చేశారని నిపుణులు కనుగొన్నారు.

బయో క్రస్టులు అంటే..

ఈ మెకానిజం వల్ల బయో క్రస్టులు(Bio Crust) అనే చిన్న చిన్న రూట్ లెస్‌ మొక్కలు, సూక్ష్మ జీవులతో తయారు చేయబడిన '' లివింగ్‌ స్కిన్‌''(Living Skin) రూపంలో ఉంటుందని నిర్ధారించారు. ఈ బయోక్రస్ట్స్‌ ప్రపంచ వ్యాప్తంగా పొడి ప్రాంతాల నేలల పై సాధారణంగా ఉంటాయి. కానీ వాటిని నిర్మాణాల్లో ఉపయోగించడం కుదరదని సాయిల్‌ ఎకోలజిస్ట్‌ మాథ్యూ బౌకర్‌ పేర్కొన్నారు.

కానీ చైనా వాల్‌ లో మాత్రం బయోక్రస్టులే కీలక పాత్ర పోషించాయి అందుకే అది చెక్కు చెదరకుందా ఉంటోందని నిపుణులు చెబుతున్నారు.

Also read: యాపిల్స్ లోని ఆ పార్ట్ ను అస్సలు తినొద్దు.. తింటే డేంజర్!

Advertisment
తాజా కథనాలు