PM Internship Program 2024: విద్య .. యువత కోసం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అనేక పెద్ద ప్రకటనలు చేశారు. తన బడ్జెట్ ప్రసంగంలో, ఉద్యోగాలు .. నైపుణ్యాలకు సంబంధించిన 5 PM ప్యాకేజీ పథకాలను ఆమె ప్రస్తావించారు. వాటిలో ముఖ్యంగా యువతకు నైపుణ్యాన్ని అందించేందుకు వెయ్యి పారిశ్రామిక శిక్షణా సంస్థలను అప్‌గ్రేడ్ చేస్తామని చెప్పిన పథకం కూడా ఉంది . ప్రతి సంవత్సరం 25 వేల మంది విద్యార్థులు స్కిల్లింగ్ లోన్‌ను పొందుతారని, 5 సంవత్సరాలలో కోటి మంది యువత నైపుణ్యం పొందుతారని ఆమె తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఇక టాప్ 500 కంపెనీల్లో కోటి మంది యువతకు ప్రభుత్వం ఇంటర్న్‌షిప్ ఇవ్వనుందని చెప్పారు. ఇంటర్న్‌షిప్ సమయంలో, విద్యార్థులకు ప్రతి నెల రూ.5,000 స్టైఫండ్ ఇస్తారు. ఈ అవకాశం ఎవరికి వస్తుందో .. అర్హత ఏమిటో తెలుసుకుందాం.
ప్రతి నెలా 5 వేల రూపాయలు ఎవరు పొందుతారు?
PM Internship Program 2024: ప్రతినెలా రూ.5,000 స్టైపెండ్‌గా ఎవరికి అందుతుంది అనేది ప్రశ్న. దీనిపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, ఈ పథకం ప్రధానమంత్రి ప్యాకేజీలో భాగమని చెప్పారు. “500 అగ్రశ్రేణి కంపెనీల్లో కోటి మంది భారతీయ యువతకు ఇంటర్న్‌షిప్ అందించే పథకాన్నిమా ప్రభుత్వం ప్రారంభించనుంది. ఇది 5 సంవత్సరాల పాటు కొనసాగుతుంది.” అని చెప్పారు.
PM Internship Program 2024: 12 నెలల పాటు పెద్ద కంపెనీలో ఉండటం ద్వారా, ఈ యువత తమ అనుభవాన్ని మెరుగుపరుచుకుంటుంది. భవిష్యత్తు కోసం తమను తాము వారు సిద్ధం చేసుకోగలుగుతారు. వారికి ఇంటర్న్‌షిప్ అలవెన్స్‌గా ప్రతి నెలా రూ.5వేలు అందచేస్తారు. అంతేకాకుండా, దీంతో పాటు వన్‌టైమ్ అసిస్టెన్స్ అలవెన్స్ రూ.6 వేలు కూడా ఇస్తారు.
అర్హతలు ఏమిటి?
PM Internship Program 2024: ఇక దీనికి అర్హతలు ఏమిటి అనేదానిపై పూర్తి వివరాలు త్వరలో వెలువడుతాయి. అయితే, బడ్జెట్ పేపర్స్ లో చెప్పిన అంశాల ప్రకారం చదువుకునే సమయంలో లేదా చదువు పూర్తయిన తర్వాత ఇంటర్న్‌షిప్ చేయడం ద్వారా ఏదైనా రంగంలో కెరీర్‌ను సంపాదించాలనుకునే విద్యార్థులకు ఇది ప్రయోజనం చేకూరుస్తుంది. ఇందుకోసం వారి వయస్సు 21 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. దీని కోసం, ఇంకా ఉద్యోగం పొందని లేదా పూర్తి సమయం చదువుతున్న వారికి అవకాశం లభిస్తుంది. వారికి స్టైఫండ్ ప్రయోజనం లభిస్తుంది. దీనికోసం శిక్షణ ఖర్చులను కంపెనీ భరిస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇది కాకుండా, ఇంటర్న్‌షిప్ ఖర్చులో 10 శాతం కంపెనీ CSR ఫండ్ నుండి తీసుకుంటారు.
యువత కోసం ఈ ప్లాన్స్ కూడా..
PM Internship Program 2024: PM ప్యాకేజీ మొదటి పథకం మొదటిసారి ఉపాధి. దీని కింద, మొదటి సారి EPFO వద్ద నమోదు చేసుకున్న వ్యక్తులు, వారి జీతం రూ. 1 లక్ష కంటే తక్కువ ఉంటే, వారికి రూ. 15 వేల సహాయం లభిస్తుంది. ఇది మూడు విడతలుగా అందుబాటులో ఉంటుంది, ఇది నేరుగా బ్యాంకు ఖాతాకు బదిలీ అవుతుంది. ఈ పథకం ద్వారా 210 లక్షల మంది యువతకు సహాయం అందించనున్నారు.
రెండవ పథకం- తయారీలో ఉద్యోగ సృష్టి. దీని సహాయంతో, మొదటిసారిగా తయారీ రంగంలో చేరిన ఉద్యోగులకు EPFO డిపాజిట్ల ఆధారంగా మొదటి 4 సంవత్సరాలు ప్రోత్సాహకాలు ఇస్తారు. దీని వల్ల 30 లక్షల మంది యువత లబ్ధి పొందనున్నారు.
మూడవ పథకం - యజమానికి మద్దతు. దీని సహాయంతో యజమానులపై భారం తగ్గించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. ఈ పథకం సహాయంతో, EPFO కొత్త ఉద్యోగుల EPFO కంట్రిబ్యూషన్‌లపై యజమానులకు 2 సంవత్సరాల పాటు ప్రతి నెలా రూ. 3,000 రీయింబర్స్‌మెంట్‌ను అందిస్తుంది.
నాల్గవ పథకం- శ్రామికశక్తిలో మహిళల భాగస్వామ్యం. దీని ద్వారా ఉద్యోగాల్లో మహిళల వాటాను పెంచేందుకు వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్, చిల్డ్రన్స్ క్రెచ్‌లు, ఉమెన్ స్కిల్లింగ్ ప్రోగ్రామ్‌లను ప్రారంభించనున్నారు.