యాపిల్ సంస్థ మార్చి 7న ‘లెట్‌లూజ్’ ఈవెంట్‌లో రెండు కొత్త ఐప్యాడ్‌ను రిలీజ్ చేసింది. వీటిలో ‘ఐప్యాడ్ ఎయిర్’ , ‘ఐప్యాడ్ ప్రో’ పేర్లతో లాంఛ్ అయిన ఈ ప్రొడక్ట్స్.. యాపిల్ యూజర్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇది లేటెస్ట్ యాపిల్ ఎం2 చిప్‌సెట్‌పై పనిచేస్తుంది. ఇందులో 11 , 13 ఇంచెస్ వేరియంట్లు ఉన్నాయి.
వీటిలో 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో పాటు వెనుక 12 ఎంపీ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. బ్లూ, పర్పుల్, స్టార్‌లైట్, స్పేస్ గ్రే కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఐప్యాడ్ ఎయిర్ 11 ఇంచెస్ ధర రూ.59,900 నుంచి మొదలవుతుంది. 13 ఇంచెస్ వేరియంట్ ధర రూ.79,900 నుంచి మొదలవుతుంది. రెండు స్క్రీన్స్‌లో.. లిక్విడ్ రెటినా డిస్‌ప్లే ఉంటుంది. 128జీబీ, 256జీబీ, 512జీబీ, 1టీబీ స్టోరేజ్ ఆప్షన్లు వీటిలో కలిగి ఉన్నాయి.
మీ కార్డులు, టికెట్లన్నీ సేఫ్‌గా స్టోర్ చేసుకోవచ్చు ఇక ఐప్యాడ్ ప్రో విషయానికొస్తే ఇందులో లెటెస్ట్ ఎం4 చిప్‌సెట్ ఉంటుంది. ఇందులో కూడా 11 అంగుళాలు, 13 అంగుళాల వేరియంట్లు ఉన్నాయి. ఇది టెన్‌డమ్ ఓఎల్‌ఈడీ అల్ట్రా రెటినా డిస్‌ప్లేతో వస్తుంది. ముందు, వెనుకా 12 మెగాపిక్సెల్ కెమెరాలుంటాయి. సిల్వర్, స్పేస్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది. 11 ఇంచెస్ ఐప్యాడ్ ప్రో ధర రూ.99,900 నుంచి మొదలవుతుంది.
13 ఇంచెస్ మోడల్ ధర రూ.1,29,900 నుంచి మొదలవుతుంది. వైఫై, వైఫై+ సెల్యూలార్ వేరియంట్లు ఉన్నాయి. 256జీబీ, 512జీబీ, 1టీబీ, 2టీబీ స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి. ఇక పెన్సిల్ ప్రో విషయానికొస్తే.. ఇందులో స్క్వీజ్, బారెల్ రోల్, హాప్టిక్ ఫీడ్‌బ్యాక్ వంటి ఫీచర్లున్నాయి. ఇది ఐప్యాడ్‌ను ఆపరేట్ చేయడానికి పనికొస్తుంది. దీని ధర రూ.11,900 ఉంది.