Science: బుర్ర తక్కువ వాడు అని ఇందుకే అంటారేమో..మన బ్రెయిన్‌ సైజ్‌ తగ్గిపోతుందంట..! కారణాలు ఇదిగో..

వేల సంవత్సరాలగా భూమి వెడక్కడం వల్ల మెదడు సైజు తగ్గుతుందని కాలిఫోర్నియాకు చెందిన నేచురల్ హిస్టరీ మ్యూజియమ్‌కు చెందిన శాస్త్రవేత్త జెఫ్ మోర్గాన్ స్టిబుల్ చెబుతున్నారు. 298 మనిషి పుర్రెలను పరీక్షించిన ఈ అద్యయనంలో ఈ 50వేల సంవత్సరాల్లో మనిషి మెదడు దాదాపు 10శాతం తగ్గిందని తేలింది.

New Update
Science: బుర్ర తక్కువ వాడు అని ఇందుకే అంటారేమో..మన బ్రెయిన్‌ సైజ్‌ తగ్గిపోతుందంట..! కారణాలు ఇదిగో..

ఓరే..బుర్ర పని చేస్తలేదా.. బుర్రెక్కడ పెట్టావ్‌.. బుర్రుండే మాట్లాడుతున్నావా..! నిత్యం ఎక్కడో అక్కడా..లేకపోతే మన నోటి నుంచో..మన చుట్టూ వాళ్ల నోటి నుంచో ఈ పదాలు వాడుతుంటాం. ఎవరైనా తింగరి పని చేస్తే 'బుర్ర తక్కువోడా' అని అంటుంటాం. ఇవన్ని నిజాలేనట. మన బుర్ర సైజు తగ్గిపోయిందట.. ఫ్యూచర్‌లో ఇంకా తగ్గిపోతుందట..! దానికి కారణాలేంటో అధ్యయనంలో తేల్చేశాయి..ఇంతకీ మన మెదడు సైజు ఎందుకు తగ్గిపోతుంది..?

వాతావరణ మార్పుల ప్రభావం:
గ్లోబల్‌ వార్మింగ్‌పై పర్యావరణ ప్రేమికులు చాలా కాలంగా గొంతెత్తుతున్నారు. అటు సైంటిస్టులు సైతం భూమి వెడక్కడం ఏ మాత్రం మంచిది కాదని చెబుతున్నారు. మనుషులు స్వార్థంతో చేస్తున్న తప్పులకు ప్రకృతి బలైపోతుంది. చివరికు ఆ ప్రకృతిలోనే భాగమైన మనుషులు కూడా ఏదో ఒక బలవ్వక తప్పదు. వాతావరణ మార్పులు మన జీవితాలపై ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కారణం అవుతాయి. అందుకే బయట వెదర్‌ని బట్టి కూడా మనిషి మూడ్‌ ఉంటుంది. వేల సంవత్సరాలగా భూమి వేడక్కడం వల్ల మెదడు సైజు తగ్గుతుందని కాలిఫోర్నియాకు చెందిన నేచురల్ హిస్టరీ మ్యూజియమ్‌కు చెందిన శాస్త్రవేత్త జెఫ్ మోర్గాన్ స్టిబుల్ చెబుతున్నారు. ఆయన చేసిన అధ్యయనం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది.

publive-image (ప్రతీకాత్మక చిత్రం)

ఎలా అధ్యయనం చేశారు?:
సైన్స్‌ జర్నల్స్‌లో ఉండే ఇన్ఫో ఎక్కడా దొరకదు. దాదాపు 50వేల సంవత్సరాల క్రితం నాటి విషయాలు కూడా జర్నల్స్‌లో ఉంటాయి. వాటినే ఆధారంగా చేసుకోని అధ్యయనం చేశారు స్టిబుల్‌. 298 మనిషి పుర్రెలను పరీక్షించాడు..కొలిచాడు.. క్రాస్‌ చెక్‌ చేసుకున్నాడు. ఈ 50వేల సంవత్సరాల్లో మనిషి మెదడు దాదాపు 10శాతం తగ్గిందని తేలింది. ఆ మనిషి పుర్రెలకు సంబంధించిన పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకున్న ఆయన అక్కడి వాతావరణ పరిస్థితులను సైతం అధ్యయనం చేశారు. ఒకప్పుడు చల్లటి ప్రదేశాలు కూడా ఇప్పుడు అగ్నిగోళంలా వేడితో మండిపోతున్నయన్న విషయం ఆయనకు అర్థమైంది. అప్పటికీ ఇప్పటికీ తేడా కేవలం వాతావరణ మార్పులేనన్న అంచనాకు వచ్చారు స్టిబుల్. అంటే వేడి ఎక్కువ అయ్యే కొద్దీ మనిషి బుర్ర సైజు తగ్గిపోతుందన్నది స్టిబుల్‌ చెబుతున్న మాట. ఈ లెక్కన చూస్తే..అప్పటితో పోల్చితే..రానున్న కాలంలో భూమి మరింత వేడక్కడం ఖాయం. అంటే మన బుర్ర సైజు కూడా రానురాను తగ్గిపోతూ ఉంటుంది. అంటే హూమన్‌ బాడీ సిస్టమ్‌ని అర్థం చేసుకోవడానికి కొత్త థియరీలు రావొచ్చు. అటు బ్రెయిన్‌ సైజు తగ్గితే ఏం అవుతుందిలే అనుకుంటే పొరపాటేనంటున్నారు సైంటిస్టులు. బాడీలో ఆర్గన్స్‌ సైజుల మార్పులు, మెదడులో జరిగే మార్పులు మన ప్రవర్తనను కూడా మారుస్తాయట..!

Advertisment