AP Ex CM Jagan: జగన్ మనుషులనే కాదు మిషన్లను కూడా నమ్మడు.. ఏపీ సచివాలయంలో కొత్త చర్చ! ఏపీ మాజీ సీఎం జగన్ గురించి ఏపీ సచివాలయంలో మరో సరికొత్త చర్చ మొదలైంది. అభద్రతా భావంతోనే ఐదేళ్లు సచివాలయం వైపు జగన్ రాలేదన్న డిస్కషన్ సాగుతోంది. మనుషులను కాదు మిషన్లను కూడా నమ్మకపోయేదని.. దీంతో కోట్లు పెట్టి క్యాంపు కార్యాలయానికి కొత్త పరికరాలను కొన్నారని తెలుస్తోంది. By Nikhil 16 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి ఏపీలో ప్రభుత్వం మారడంతో.. అనేక ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. నిన్నంతా జగన్ తన క్యాంప్ ఆఫీసులో ప్రభుత్వ ఫర్నీచర్ అలాగే ఉంచుకున్నారంటూ సోషల్ మీడియాలో చర్చ సాగిన విషయం తెలిసిందే. ఈ అంశంపై రియార్ట్ అయిన వైసీపీ.. ఈ విషయంపై ప్రభుత్వానికి ఇప్పటికే సమాచారం ఇచ్చామని తెలిపింది. ఆ ఫర్నీచర్ కు విలువకట్టి చెబితే.. డబ్బులు చెల్లిస్తామని తెలిపామని వెల్లడించింది. అయితే.. తాజాగా మాజీ సీఎం జగన్ కు సంబంధించి మరో అంశం సెక్రటేరీయట్ లో చర్చనీయాంశంగా మారింది. ఐదేళ్లలో కేబినెట్ భేటీకి తప్పా... జగన్ సెక్రటేరియట్‌కు రాలేదన్న చర్చ సాగుతోంది. అయితే.. కేవలం అభద్రతా భావంతోనే సచివాలయం వైపు జగన్ రాలేదని చెబుతున్నారు. ఇంకా పలువురు అధికారులు అయితే.. మనుషులనే కాదు... మెషీన్లనూ కూడా జగన్ నమ్మేవారు కాదంటున్నారు అధికారులు. ఇంకా.. సీఎం చాంబర్‌లోనే కూర్చొవడానికి కూడా జగన్ ఇష్టపడలేదన్న డిస్కషన్ సాగుతోంది. ఇంకా.. అధికారిక వైఫై కూడా సీఎం పేషీ సిబ్బంది వాడుకోలేదని తెలుస్తోంది. 2019లో టీడీపీ హాయాంలో ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ డివైఎస్‌లను జగన్ సిబ్బంది వాడలేదని సమాచారం. వీడియో కాన్ఫరెన్స్ పరికరాలను కూడా జగన్ సిబ్బంది పక్కనపెట్టినట్లు తెలుస్తోంది. ఇన్నిరోజులు వాడకపోవడంతో ప్రింటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు పనికిరాకుండా పోయాయని తెలుస్తోంది. దీంతో క్యాంప్ ఆఫీసు కోసం కోట్లు వెచ్చించి కొత్త పరికరాలను అప్పటి అధికారులు కొన్నారన్న చర్చ సాగుతోంది. రివ్యూకు వచ్చే అధికారులు కూడా ఐడి కార్డు, ఫోటోలు ముందుగా పంపితేనే జగన్ క్యాంప్ ఆఫీస్ లోకి అనుమతించేవారని అధికారులు చెబుతున్నారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి