Ap: మ్యారేజ్‌ సర్టిఫికేట్‌ చూపిస్తే...కొత్త జంటకు రేషన్‌ కార్డు!

రాష్ట్రంలో కొత్త రేషన్‌ కార్టుల జారీ ప్రక్రియ త్వరలోప్రారంభం కానుంది. వివాహ నమోదు ధ్రువీకరణ పత్రం ఆధారంగా వీటిని జారీ చేసే విధానాన్ని త్వరలోనే రాష్ట్రంలో అమలు చేయనున్నారు.జగన్‌ బొమ్మ, వైసీపీ రంగులతో ఉన్న కార్డులను కూడా మార్చాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది.

New Update
Ap: మ్యారేజ్‌ సర్టిఫికేట్‌ చూపిస్తే...కొత్త జంటకు రేషన్‌ కార్డు!

AP New Ration Cards: రాష్ట్రంలో కొత్త రేషన్‌ కార్టుల జారీ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. వివాహ నమోదు ధ్రువీకరణ పత్రం (Marriage Certificate) ఆధారంగా వీటిని జారీ చేసే విధానాన్ని త్వరలోనే రాష్ట్రంలో అమలు చేయనున్నారు. 2019-24 మధ్య వైసీపీ ప్రభుత్వం రేషన్‌ కార్డుల్నీ వదలకుండా..జగన్ బొమ్మను ముద్రించింది. వైసీపీ రంగులతోనే కార్డులు ఇచ్చిన సంగతి తెలిసిందే. వాటిని కూడా మార్చి కొత్త కార్డులు ఇవ్వాలని ఎన్డీయే ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన డిజైన్లు ప్రభుత్వాధికారులు పరిశీలిస్తున్నారు.

ఏపీలో ప్రస్తుతం 1.48 కోట్ల రేషన్‌ కార్డులున్నాయి. ఇందులో 89 లక్షల రేషన్‌ కార్డులకు ఆహార భద్రత చట్టం కింద కేంద్రం నిత్యావసరాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. మిగిలిన కార్డులకు రేషన్‌ ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోందని అధికారులు తెలిపారు.

వీటిని కూడా కేంద్ర ఆహార భద్రతా చట్టం పరిధిలోకి తీసుకోవాలని రాష్ట్రం డిమాండ్‌ చేస్తుంటే..నిబంధనలు అంగీకరించవని కేంద్రం దాటవేస్తోంది.

Also Read: మాజీ విదేశాంగ మంత్రి కన్నుమూత!

Advertisment
తాజా కథనాలు