New Beers in Telangana: తెలంగాణలోకి కొత్త బీర్లు ఎంట్రీ! పేర్లు అదిరిపోయాయిగా..

తెలంగాణలోకి కొత్త కంపనీ బీర్లు ఎంట్రీ ఇవ్వబోతున్నాయని వార్తలు వస్తున్నాయి. సోమ్ డిస్టిలరీస్ తయారు చేస్తున్న కొన్ని బీరు బ్రాండ్ల అమ్మకాలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్టు చెబుతున్నారు. ఈ వార్తలపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. 

New Update
New Beers in Telangana: తెలంగాణలోకి కొత్త బీర్లు ఎంట్రీ! పేర్లు అదిరిపోయాయిగా..

New Beers in Telangana: మందుబాబులకు బీర్ అంటే అదోరకమైన ప్రేమ ఉంటుంది. ఎండాకాలం వచ్చిందంటే బీర్లు తెగలాగించేస్తుంటారు. బీర్లు తాగడానికి కూడా బ్రాండ్స్ తప్పనిసరిగా చూసుకుంటారు. బీరు ప్రియులు. అయితే, ఏపీలో బూమ్ బూమ్ లాంటి కొత్త బ్రాండ్స్ తీసుకువచ్చి.. వైసీపీ ప్రభుత్వం చాలా ట్రోలింగ్ కి గురైంది. ఇప్పుడు అదే బాటలోకి తెలంగాణ సర్కారు కూడా చేరుతున్నట్టు కనిపిస్తోంది. తెలంగాణలో కొత్త బీర్లు అందుబాటులోకి రానున్నాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది . ఈ మేరకు కొత్త బ్రాండ్ బీర్లు అంటూ ఫోటో నెట్టి తెగ సందడి చేస్తోంది. సోమ్ డిస్టిలరీస్ తెలంగాణలో తమ బ్రాండ్ బీర్‌ను సరఫరా చేయడానికి అనుమతి పొందినట్లు ప్రచారం జరుగుతోంది.  పవర్ 1000, హంటర్, బ్లాక్ ఫోర్ట్, ఉడ్ పీకర్ వంటి పేర్లతో కొత్త బీర్లు షాపుల్లో దొరుకుతాయంటూ సోషల్ మీడియాలో ఓ ఫోటో వైరల్ అవుతోంది . ప్రస్తుతం తెలంగాణలోని కింగ్ ఫిషర్, ఆర్సీ, 5000 వంటి బీర్లు అందుబాటులో ఉన్నాయి.

New Beers in Telangana: తెలంగాణలో కొత్త బీర్ల ప్రచారంపై ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు . రాష్ట్ర ప్రభుత్వం కొత్త మద్యం బ్రాండ్లను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తోందని జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు . రాష్ట్రంలో కొత్త బ్రాండ్ల కోసం ఎవరూ దరఖాస్తు చేసుకోలేదని, వాటిని తాను పరిశీలించలేదని తేల్చారు. గత ప్రభుత్వం అనేక శాఖల్లో బిల్లులు పెండింగ్‌లో ఉంచిందని, పెండింగ్ బిల్లులు ఉన్న కంపెనీలు బీరు సరఫరా చేయలేక పోతున్నాయన్నారు. రాష్ట్రంలో ఎక్కడా మద్యం కృత్రిమ కొరత లేదని మంత్రి స్పష్టం చేశారు .

ప్రతిపక్షాల విమర్శలు తెలంగాణలో రూ . 5000 కోట్ల మద్యం కుంభకోణం జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. గత రెండు, మూడు నెలలుగా బీరు రాకపోవడం వెనుక భారీ కుట్ర దాగి ఉందని ఆరోపించారు. కమీషన్ ను బట్టి తెలంగాణలో కొత్త బ్రాండ్లకు గేట్లు తెరిచే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఎన్నికల ఫలితాల తర్వాత కొన్ని ప్రముఖ బ్రాండ్లు కనుమరుగై కొత్త బ్రాండ్లు వచ్చే అవకాశం ఉందని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు . రాష్ట్రంలో మద్యం కొరత సృష్టించి కొత్త బ్రాండ్లను ప్రవేశపెట్టే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బీర్ బ్రాండ్లపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

New Beers in Telangana: అయితే, తెలంగాణలో ఎంట్రీపై సోమ్ డిస్టిలరీస్ అప్ డేట్ ఇచ్చిందని చెబుతున్నారు. దాని ప్రకారం సోమ్ డిస్టిలరీస్ తెలంగాణలో తమ కంపెనీ బీర్ల అమ్మకలకు అనుమతి ఇచ్చినట్టు స్టాక్ ఎక్స్చేంజ్ కు లేఖ రాసింది. తెలంగాణలో తమబీర్ల అమ్మకాల ద్వారా మంచి బిజినెస్ జరుగుతుందని.. కంపెనీ విస్తరణకు పెద్ద అవకాశాలు లభిస్తాయని స్టాక్ ఎక్స్చేంజ్ కు సోమ్ డిస్టిలరీస్ తెలిపినట్టు వార్తలు వస్తున్నాయి. 

మరోవైపు సోమ్ డిస్టిలరీస్ ఎంట్రీపై వస్తున్న వార్తలతో తెలంగాణలోని ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. గతంలో సోమ్ డిస్టిలరీస్ పై మధ్యప్రదేశ్ లో వివాదం ఉందనీ.. అక్కడ ఈ కంపెనీ మద్యం సేవించి 24 మంది చనిపోయారనీ.. అందుకే అక్కడ ఈ కంపనీని బ్యాన్ చేశారని బీఆర్ఎస్ నేత  క్రిషాంక్ ఆరోపిస్తున్నారు. 

Advertisment