Telangana Ration Cards: కొత్త రేషన్ కార్డులకు అప్లికేషన్ ఫామ్ ఇవే..!

కొత్త రేషన్ కార్డుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం స్పీడ్ పెంచినట్లు కనిపిస్తోంది. డిసెంబర్ 28వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులను స్వీకరిస్తామని ప్రకటించింది ప్రభుత్వం. తాజాగా రేషన్ కార్డు అప్లికేషన్ ఫామ్స్ ఇవేనంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Telangana Ration Cards: కొత్త రేషన్ కార్డులకు అప్లికేషన్ ఫామ్ ఇవే..!
New Update

Telangana Ration Cards: రేషన్ కార్డుల విషయంలో తెలంగాణ సర్కార్ స్పీడ్ పెంచింది. కొత్త రేషన్ కార్డులు, రేషన్ కార్డులో మార్పులకు సంబంధించి ఇప్పటికే డేట్‌ను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు అందుకు సంబంధించిన దరఖాస్తు ఫారమ్‌లను విడుదల చేసింది. ఇవే దరఖాస్తు ఫారమ్స్ అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డిసెంబర్ 28వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించనుంది ప్రభుత్వం. రేషన్ కార్డుల రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో దాదాపు 89 లక్షల రేషన్ కార్డ్స్ ఉన్నాయి. ఆరోగ్య శ్రీ, నెలకు రూ. 2,500, ఫ్రీ సిలిండర్ పథకాలకు రేషన్ కార్డే కీలకం. దాంతో చాలా మంది లబ్ధిదారులు రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నారు.

రేషన్ కార్డ్ రూల్స్ ఇవే..

ప్రభుత్వం నుంచి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం డిసెంబర్ 28వ తేదీ నుంచి రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. మీ-సేవ ద్వారానే దరఖాస్తులు స్వీకరించనున్నారు. 28 వ తేదీ నుంచే రేషన్ కార్డుల్లో మార్పులు చేసుకునే అవకాశం ఉంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న తరువాత.. ఈ దరఖాస్తులను పరిశీలించనున్నారు. ప్రజల వద్దకే వచ్చి అర్హులను ఎంపిక చేయనున్నారు. గ్రామ, బస్తీ సభల ద్వారా దరఖాస్తుదారులను ఎంపిక చేస్తారని సమాచారం అందుతోంది. అలాగే లబ్ధిదారుల ఎంపికకు ప్రభుత్వం స్పెషల్ నోడల్ ఆఫీసర్లు నియమించనుందని తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 89.98 లక్షల రేషన్ కార్డ్స్ ఉండగా.. ఎన్నికలకు ముందు నాటికి 11 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఈ రేషన్ కార్డ్స్ ఎప్పుడిస్తారా? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు లక్షల కుటంబాలు. అయితే, రేషన్ కార్డు కోసం అర్హుల ఎంపిక ప్రభుత్వానికి కత్తిమీద సాములా మారనుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

అప్లికేషన్ ఫామ్స్ ఇవేనా?..

గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా మారాయి రేషన్ కార్డుల అంశం. ప్రభుత్వం ఎప్పుడు దరఖాస్తులను స్వీకరిస్తుందా అని ఎదురు చూస్తుండగా.. సోషల్ మీడియాలో అప్లికేషన్ ఫామ్స్ ఇవే అంటూ వైరల్ అవుతున్నాయి. కొత్త అప్లికేషన్ల కోసం ఒక అప్లికేషన్ ఫామ్, సవరణల కోసం ఒక ఫామ్, యాడింగ్ కోసం ఒక ఫామ్‌ ఉన్నాయి.

Also Read:

సైబరాబాద్ పరిధిలో భారీగా పెరిగిన సైబర్ క్రైమ్ కేసులు..!

 హైదరాబాద్ వాసులకు అలర్ట్.. ఆ బ్రిడ్జి మూసివేత.. ప్రత్యామ్నాయ రూట్ ఇదే!

#telangana-government #telangana-ration-cards
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి