మైనారిటీలకు వ్యతిరేకంగా తామెప్పుడు వ్యవహరించలేదని.. ఒక్క మాట కూడా వారి గురించి తప్పుగా మాట్లాడలేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.దీనిపై పీటీఐ వార్తా సంస్థకు ప్రధాని మోదీ ఇంటర్వ్యూ: అంబేద్కర్ నుంచి నెహ్రూ వరకు మత ప్రాతిపదికన సీట్ల రిజర్వేషన్ మాత్రమే వ్యతిరేకించామన్నారు. మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వకూడదని మోదీ తెలిపారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలను ఇన్ని దశాబ్దాలు చేసిందిని దానికి మాత్రమే బీజేపీ ప్రభుత్వం వ్యతిరేకించదని వెల్లడించారు.
రాజ్యాంగ నిర్మాతల ఉద్దేశాన్ని తారుమారు చేసేందుకు కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నానే మా పై ఈ దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.రాబోయే ఎన్నికల్లో దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించబోతుందని తెలిపారు. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ, దాని మిత్రపక్షాలు ఎక్కువ సీట్లు గెలుచుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
బిజూ జనతాదళ్ పాలనలో పూరీలోని జగన్నాథ ఆలయ భద్రత ప్రశ్నార్థకంగా మారింది. గత 6 సంవత్సరాలుగా గుడి తాళం మాయమైంది. ఒడిశాలో ఖనిజాల దోపిడీ జరుగుతోంది. ఒడిశా రాష్ట్రం సహజ వనరులతో సమృద్ధిగా ఉంది. కానీ పేదరికం ఉంది.
ఇది చూసి నేను బాధపడ్డాను. ఒడిశాలో తొలిసారి బీజేపీ అధికారం చేపట్టబోతోంది. ఒడిశాలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తాం. ప్రధాని మోదీ ఈ విధంగా మాట్లాడారు.