చాలా మంది ఎంత సంపాదించినా చేతిలో రూపాయి నిలవడం లేదని చాలా బాధపడుతుంటారు..తెలిసి చేసిన తప్పుల వల్లో తెలియక చేసిన తప్పుల వల్లో లక్ష్మీ దేవి నిలవదు.అందుకే పెద్దలు కొన్ని నియమాలు పెట్టారు. అలా చేయడం వల్ల లక్ష్మీదేవి కొంతలో కొంత అయినా నిలుస్తుందని నమ్మకం.
మరీ ముఖ్యంగా రాత్రి పూట ఎట్టి పరిస్థితుల్లోనూ కొన్ని తప్పులు చేయకుండా ఉండాలి. అలాంటి వాటిలో కొన్నింటిని ఇప్పుడు చూద్దాం. సాయం సంధ్య వేళ, రాత్రులు ఎట్టి పరిస్థితుల్లోనూ అస్సలు గోర్లు కత్తిరించకూడదు. ఇలా చేయడం వల్ల లక్ష్మీ దేవికి కోపం వస్తుంది.
రాత్రి పూట ఎట్టి పరిస్థితుల్లోనూ స్త్రీలు కానీ, పురుషులు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ సెంట్ కొట్టుకోకూడదు. పరిమళ ద్రవ్యాలు ఇంట్లో కొట్టడం వల్ల లక్ష్మీ దేవికి ఆగ్రహం కలుగుతుంది. అంతేకాకుండా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ కూడా పెరుగుతుంది. దాని వల్ల దుష్ట శక్తులు ఇంట్లో తిరుగుతాయి కాబట్టి ఈ పొరపాటు అస్సలు చేయకండి.
రాత్రి పూట ఎవ్వరికీ అప్పు ఇవ్వరాదు. అలా చేయడం వల్ల లక్ష్మీ దేవికి కోపం వచ్చి ఇల్లు విడిచి వెళ్లిపోతుంది. అలానే రాత్రిపూట ఎట్టి పరిస్థితుల్లోనూ తులసి మొక్కని ముట్టుకోకూడదు. తులసి ఆకులను కూడా కోయకూడదు. ఈ పొరపాటు అసలు చేయరాదు. ఇలా చేయడం వల్ల దరిద్రం పట్టుకుంటుంది.
ఇంట్లో శాంతి సంతోషాలు పోయి సమస్యలు పెరుగుతాయి. అంతే కాకుండా రాత్రి పూట తిన్న గిన్నెలను అలానే వదిలేయకూడదు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవికి అన్నపూర్ణదేవికి కోపం వస్తుంది.కాబట్టి ఈ పొరపాట్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకుండా చూసుకోండి.
Also read: ‘దండం పెట్టాల్సింది మీకు కదా బ్రో..’ ఆర్‌సీబీ టీమ్‌పై ట్రోలింగ్!