Viral video: కాలితో తన్నాడు, చెవులు పిండి..చెంప చెళ్లుమనిపించాడు..జీడిమెట్ల ట్రాఫిక్ సీఐ ఎందుకిలా చేశాడు?

వివాదాస్పదుడిగా పేరొందిన హైదరాబాద్‌ జీడిమెట్ల సీఐ వెంకట్‌రెడ్డి మరోసారి చిక్కుల్లో పడ్డారు. ఐబీపీఎల్‌ చౌరస్తా వద్ద ఓ ట్రావెల్స్‌ బస్సు డ్రైవర్‌ని కాలితో తన్ని చెంప పగలగొట్టాడు. అతని చెవులు పిండాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. నెల మామూల కోసమే ఇలా చేశాడని మిగిలిన ట్రావెల్స్‌ బస్సు డ్రైవర్లు ఆరోపిస్తుండగా.. సదరు డ్రైవర్‌ ర్యాష్‌గా బస్సు నడుపుతున్నాడని.. అడిగితే దురుసుగా సమాధానం చెప్పడంతోనే అలా చేయాల్సి వచ్చిందని వెంకట్‌రెడ్డి వివరణ ఇచ్చారు.

New Update
Viral video:  కాలితో తన్నాడు, చెవులు పిండి..చెంప చెళ్లుమనిపించాడు..జీడిమెట్ల ట్రాఫిక్ సీఐ ఎందుకిలా చేశాడు?

తమది ఫ్రెండ్లీ పోలిసింగ్‌ అంటూ తెలంగాణ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ ఇప్పటికీ అనేక సార్లు చెప్పింది. సామాన్యులతో ఫ్రెండ్లీగా ఉంటామని చెబుతుంటోంది. అయితే హైదరాబాద్‌ జీడిమెట్ల(Jeedimetla)లో జరిగిన ఓ ఘటన చూసిన తర్వాత నెటిజన్లు పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ని ప్రశ్నిస్తున్నారు. ఓ బస్సు డ్రైవర్‌ని కాలితో తన్నిన ట్రాఫిక్‌ సీఐ(Traffic CI) వీడియో సోషల్‌మీడియాలో వైలర్‌గా మారింది. అతను జీడిమెట్ల సీఐ వెంకట్‌రెడ్డి(Venkat reddy). ఓ ట్రావెల్స్‌ బస్సు డ్రైవర్‌ని కాలితో తన్నాడు. ఇది చూసి అక్కడున్నవారు ముక్కున వేలు వేసుకున్నారు. ఇదేంటి సీఐ ఇలా ప్రవర్తిస్తున్నాడంటూ ఆయన వైపు అలానే చూశారు. ఎవరో ఈ ఘటనను వీడియో తీసి సోషల్‌మీడియాలో పెట్టారు.

మామూల కోసమా?
జీడిమెట్ల ట్రాఫిక్ సీఐ వెంకట్ రెడ్డి పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో వివాదాస్పదుడుగా పేరుంది. నడి రోడ్డుపై బస్సు డ్రైవర్‌ను బూటు కాలుతో తన్నిన వైనం తాజాగా వెలుగుచూసింది. చట్టం అమలు చేసే వారే చట్టాన్ని ఉల్లంగించారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కాలితో తన్నడం, బూతులు తిట్టడం, చెవులు పిండి, చెంప పగలగొట్టటం.. ఇదేనా ఫ్రెండ్లీ పోలీసింగ్ అని నిలదీస్తున్నారు. ఖాకీల పరువు తీశాడని మరికొందరు అంటున్నారు. నిబంధనలు ఉల్లంగిస్తే చాలన్‌ విధించాలని కానీ చెంప పగలుగొట్టటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇక నెల మామూల కోసమే ఇలా చేస్తున్నాడు అంటున్నారు మిగితా ట్రావెల్స్ బస్సు డ్రైవర్లు. రాత్రి 10 గంటల తర్వాతే బస్సులు తీసినా ఐడీపీఎల్‌ వద్ద రోడ్డుపై ఆపి హంగామా చేస్తుంటాడని ఆరోపిస్తున్నారు. జీడిమెట్ల ట్రాఫిక్ సీఐ రూటే సెపెరేటు అని పోలీసులు కూడా అంటున్నారు. స్టేషన్‌లోను సిబ్బందిపై దురుసు ప్రవర్తన, బూతు పురాణం అతని నైజం అని చెబుతున్నారు. ఇప్పటికైనా పోలీస్ ఉన్నత అధికారులు ఇలాంటి వారి పట్ల కాస్త కన్నేసి ఉంచి ప్రజల్లో పోలీసులపై ఉన్న గౌరవం తగ్గకుండా చూడాలని బాధితులు కోరుకుంటున్నారు.

సీఐ ఏం చెబుతున్నారు?
ట్రావెల్స్‌ బస్సు డ్రైవర్‌లపై చేయి చేసుకున్న ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌ కావడంతో వెంకట్‌ రెడ్డి స్పందించారు. ఎందుకు అలా కొట్టాల్సి వచ్చిందో వివరించారు. ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ పెద్దపెద్దగా హార్న్‌ కొట్టుకుంటూ ఆ డ్రైవర్‌ దూసుకువెళ్తున్నాడని చెప్పారు. బస్సు ఆపమని చెప్పినా వినలేదని.. అందుకే ఐడీపీఎల్‌ చౌరస్త దగ్గర బస్సును ఆపినట్టు తెలిపారు. ముందుగా డ్రైవరే తమతో దురుసుగా ప్రవర్తించాడని.. అందుకే కోపం ఆపుకోలేక అలా చేయాల్సి వచ్చిందని చెబుతున్నాడు సీఐ.

ALSO READ: లైట్‌ తీసుకుంటే అంతే..ఈరోజు నుంచి వర్షాలు..కుమ్ముడే కుమ్ముడు!

Advertisment
తాజా కథనాలు