Netizen Bad Comments On Rashmi Gautam : బుల్లితెర గ్లామరస్ యాంకర్ రష్మీ గౌతమ్(Rashmi Goutam) సోషల్ మీడియా(Social Media) లో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిత్యం ఏదో ఒక పోస్ట్ పెడుతూ ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ అప్పుడప్పుడు ట్రోల్స్ కి కూడా గురవుతుంటుంది. అయినా వాటికీ ఏమాత్రం భయపడకుండా తనదైన స్టైల్ లో కౌంటర్ అటాక్ చేస్తుంది.
కాగా రష్మీ యానిమల్ లవర్(Animal Lover) అనే విషయం అందరికీ తెలుసు. మూగ జీవాలను హింసించే వారిపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతుంది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో పై రష్మి రియాక్ట్ అవ్వగా.. ఆమె రియాక్షన్ నచ్చని ఓ నెటిజన్ 'రష్మిని చెప్పుతో కొట్టాలి' అంటూ సంచలన కామెంట్స్ చేసాడు. ఆ కామెంట్స్ పై రష్మీ స్పందించిన తీరు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.
రష్మిని ఏ చెప్పుతో కొట్టాలి?
రష్మి రియాక్ట్ అయిన వీడియోలో ఓ వ్యక్తి గన్ పట్టుకొని ఆవును షూట్ చేస్తుంటాడు.. దానిపై రష్మి.." హిందువులు ఇలాంటివి జరగకుండా చూడాల్సింది. ఇదంతా మన తప్పు వల్లే ఆవు ప్రాణాలు కోల్పోయింది" అంటూ తన పోస్ట్ లో పేర్కొంది. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ.." ఎవర్తిరా ఇది? అక్కడ ఆడవాళ్లను నగ్నంగా ఊరేగిస్తూ రేప్ చేసి చంపేస్తున్నారు. చిన్న పిల్లల్ని కూడా వదలకుండా చంపేస్తే అడగకుండా ఒక ఆవును చంపితే అడుగుతుంది. చిన్న పిల్లల్ని చంపేస్తుంటే రెస్పాండ్ అవ్వదు ఈమెని ఏ చెప్పుతో కొట్టాలి?" అని పేర్కొన్నాడు.
మనుషులకు, పశువులకు తేడా కనిపించదు
నెటిజన్ చేసిన కామెంట్స్ కి రష్మి రియాక్ట్ అవుతూ.." బ్రెయిన్ వాడండి.. ఈ రోజు ఎద్దులు, ఆవులు, కాకులే రేపటి మీ పిల్లలు. మనిషి ఒక్కసారి చంపడానికి సిద్ధం అయితే వాడికి మనుషులకు,పశువులకు తేడా కనిపించదు. అక్కడ ఏ ధర్మం పనికిరాదు" అంటూ రిప్లై ఇచ్చింది.