Netaji Jayanti : నేతాజీకి ఇష్టమైన వంటకాలు ఇవే.. బోస్ బర్త్ డే స్పెషల్!

నేడు నేతాజీ జన్మదినం. నేతాజీకి బెంగాలీ వంటకాలు అంటే ఎంతో మక్కువ. బోస్‌కు రస్‌గుల్లా స్వీట్‌ అంటే కూడా చాలా ఇష్టం. ఆయన తరచుగా భోజనం తర్వాత అరటిపండు తినేవారు. అంతేకాకుండా నేతాజీ ఖిచ్డీ, పెసరపప్పును ఎక్కువగా తినేవారు.

New Update
Netaji Jayanti : నేతాజీకి ఇష్టమైన వంటకాలు ఇవే.. బోస్ బర్త్ డే స్పెషల్!

Netaji Subhas Chandra Bose Jayanti : ప్రముఖ స్వాతంత్ర సమరయోధుల్లో నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌(Subhas Chandra Bose) ఒకరు. నేడు ఆయన జన్మదినం. ఆయన ఎక్కువగా ఏ వంటకాలను ఇష్టపడేవారు.? ఏం చేసేవారు అనే విషయాలు తెలుసుకుందాం. నేతాజీ(Netaji) కి బెంగాలీ వంటకాలు(Bengali Foods) అంటే ఎంతో మక్కువ. అంతే కాకుండా ఆయన టీ ఎక్కువగా తాగేవారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ మాండ్లా జైలులో ఉన్నప్పుడు అక్కడి ఆహారం గురించి తరచూ కోడలు విభావతి బోస్‌(Bibhabati Bose) కు లేఖలు రాసేవారు. జైలులో సరైన భోజనం దొరకడం లేదని, ఆహారం పేరుతో బొప్పాయి, బెండకాయ, బచ్చలికూరతో తృప్తిపడాల్సి వస్తుందని చెప్పేవారు. జైలులో ఆహారం గురించి సూపరింటెండెంట్‌కు కొన్ని లేఖలు కూడా రాశారు ఆయన.

బెంగాలీ వంటకాలు :

ముఖ్యంగా సరస్వతి పూజ, హోలీ, దీపావళి ప్రత్యేక వంటకాల గురించి చెప్పేవారు. తోటి ఖైదీలకు ఆహారం ఎలా తయారు చేయాలో సూచించేవారు. జైలు సూపరింటెండెంట్‌కు రాసిన లేఖలో ఆయన రసగుల్లాను ప్రస్తావించారు. నేతాజీకి రస్‌గుల్లా, చంచమ్‌ వంటి స్వీట్‌లు అంటే చాలా ఇష్టం. మరో లేఖలో జైలులో లభించే పచ్చళ్లు, మసాలా దినుసుల గురించి కూడా పేర్కొన్నాడు. అయితే ఇక్కడ లభించే ఫుడ్ ఐటమ్స్‌లో బెంగాలీ స్టయిల్ ఫుడ్ దొరకడం లేదని రాశాడు. అతను దాల్-భాత్, పూరీ, పెరుగు మొదలైన బెంగాలీ ఆహారాన్ని ఎక్కువగా ఇష్టపడేవాడు. అతను తరచుగా భోజనం తర్వాత అరటిపండు తినేవాడు. జైలులో బెంగాలీ వంటలు చేయడానికి ఏమీ అందుబాటులోలేవని సౌకర్యాలు కల్పించాలని కోరారు.

Also Read : Subhas Chandra Bose : వర్ధంతి ఎరుగని చంద్రబోస్ జయంతి ఇవాళ..

వంటకాలపై కోడలికి లేఖ:

అంతే కాకుండా నేతాజీ ఖిచ్డీ, పెసరపప్పును ఎక్కువగా తినేవాడు. టీ అంటే ఎక్కువ ఇష్టం ఉండటంతో డార్జిలింగ్ టీని జైలుకు పంపేందుకు ఏర్పాట్లు చేయమని ఒకసారి తన అన్న శరత్ చంద్రబోస్‌కు లేఖ రాశాడు. జైలులో రోజుకు కనీసం 30 లేదా 40 సార్లు నేతాజీ టీ తాగేవాడు. ఒకసారి జైలు రెస్టారెంట్ మేనేజర్ తన కోసం ఎక్కడి నుంచో తెచ్చిన అనేక బెంగాలీ వంటకాలను ప్రత్యేకంగా రుచి చూసి వాటి గురించి వివరిస్తూ కోడలికి లేఖ రాశాడు. అవి పప్పుతో చేసిన ధోకర్ దాల్నా, చెనార్ కాలియా, చెనార్ పులావ్. మరోవైపు నేతాజీ సుభాష్ చంద్రబోస్ కోల్‌కతాలోని ఎల్గిన్ రోడ్‌లోని తన అన్నయ్య శరత్ ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఇంట్లో రెండు కిచెన్‌లు ఉన్నాయని, ఒకటి సాంప్రదాయ వంటగది అని, రెండవ వంటగది పాశ్చాత్య వంటకాలు చేసుకోవడానికని చెప్పేవారు. సుభాష్ చంద్రబోస్ తన ఇంటిలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ సమావేశాలకు హాజరైనప్పుడు లేదా దేశంలో ఎవరైనా ఆయన్ని ఇంటికి ఆహ్వానిస్తే నేలపై కూర్చుని సాంప్రదాయ పద్ధతిలో భోజనం చేసేవారు

ఇది కూడా చదవండి: జామకాయ చట్నీ ఎప్పుడైనా తిన్నారా..ఎన్ని లాభాలో తెలుసా?

Advertisment
తాజా కథనాలు