నేపాల్ బస్సు ప్రమాద ఘటనలో లభ్యమైన భారతీయుడి మృతదేహం!

నేపాల్‌ లోని త్రిశూలి నదిలో 51 మంది గల్లంతయిన ఘటనలో ఒక భారతీయుడి మృతదేహం లభ్యమైంది.శుక్రవారం తెల్లవారుజామున మదన్-ఆష్రిత్ జాతీయ రహదారిపై రెండు బస్సులపై కొండచరియలు విరగిపడిన ఘటన చోటు చేసుకుంది. గల్లంతయిన వారిలో ఏడుగురు భారతీయులు ఉన్నట్టు తెలుస్తోంది.

New Update
నేపాల్ బస్సు ప్రమాద ఘటనలో లభ్యమైన భారతీయుడి మృతదేహం!

శుక్రవారం తెల్లవారుజామున మదన్-ఆష్రిత్ జాతీయ రహదారిపై 66 మంది టూరిస్ట్‌లతో వెళ్తున్న రెండు బస్సులపై  ఒక్కసారిగా కొండచరియలు విరగిపడ్డాయి. దీంతో బస్సులు త్రిశూలి నదిలోకి పడిపోయాయి. ఈ ఘటనలో రెండు బస్సుల్లోని ప్రయాణికులు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయారు.

ఈ ఘటనలో ముగ్గురు మాత్రమే  ప్రాణాలతో బయటపడ్డారు. మరో 51 మంది గల్లంతయ్యారు.ఈ సందర్భంలో, ప్రమాద స్థలానికి 50 కిలోమీటర్ల దూరంలోని నారాయణి నదిలో నిన్న ఒక మృతదేహాన్ని సహాయక సిబ్బంది గుర్తించింది. మృతదేహం వద్ద గుర్తింపు కార్డును తనిఖీ చేయగా అతను భారత్ కు చెందిన రిషి పాల్ సాహి అని తేలింది.మరో ఆరుగురు భారతీయులు సహా 50 మంది కోసం సహాయక సిబ్బంది అన్వేషణ కొనసాగుతోంది.

Advertisment
తాజా కథనాలు