AP Politics: నెల్లూరు ఎంపీగా విజయం సాధించిన నేపథ్యంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ఎప్పుడూ ఇలాంటి తీర్పు చూడలేదన్నారు. ఈ తీర్పుతో నెల్లూరు జిల్లా అభివృద్ధి కోసం పాటుపడుతానని తెలిపారు. జిల్లా ప్రజలకు వేమిరెడ్డి కుటుంబం రుణపడి ఉంటుందన్నారు. తాను, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం అని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలు లేని కారణంగా వేలాది మంది నిరుద్యోగులు ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేయాల్సి దుస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగులు కసితో ఓటు వేసే జగన్మోహన్‌రెడ్డికి ఇంటికి పంపారని అన్నారు. కోవూరు ప్రజలకు రుణపడి ఉంటానని ప్రశాంతిరెడ్డి తెలిపారు. అందరికీ అందుబాటులో ఉంటానన్నారు.
ఆత్మకూరు ఎమ్మెల్యేగా విజయం సాధిచిన ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ.. 2024 ఎన్నికల్లో జగన్మోహన్‌రెడ్డిని ప్రజలు సరైన తీర్పు ఇస్తారని ఏడాదిన్నర క్రితం చెప్పానన్నారు. రాష్ట్ర ప్రజలు వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడ లేకుండా చేశారన్నారు. కూటమి అధికారంలోకి వస్తుందని తాను ఎప్పుడో గుర్తించానని ఆనం అన్నారు. ఇలాంటి తీర్పు ఇచ్చిన ప్రజలు రుణపడి ఉంటానన్నారు.
ఇది కూడా చదవండి: మీరు పిల్లలను వాటర్ పార్కుకు తీసుకెళ్లాలనుకుంటే.. ఈ విషయం తప్పకుండా తెలుసుకోండి!