Mayor: ప్లీజ్.. మమ్మల్ని క్షమించండి శ్రీధర్ రెడ్డి.. నెల్లూరు మేయర్ స్రవంతి సంచలన వ్యాఖ్యలు.!

నెల్లూరు మేయర్ స్రవంతి వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అప్పట్లో అధికార పార్టీ నేతల బెదరింపులకు భయపడి శ్రీధర్ రెడ్డిని వీడి వైసీపీలోకి వెళ్ళాల్సి వచ్చిందన్నారు. తమ తప్పులను మన్నించి శ్రీధర్ రెడ్డి తిరిగి తమను అక్కున చేర్చుకోవాలని కోరారు.

New Update
Mayor: ప్లీజ్.. మమ్మల్ని క్షమించండి శ్రీధర్ రెడ్డి.. నెల్లూరు మేయర్ స్రవంతి సంచలన వ్యాఖ్యలు.!

Nellore Mayor Sravanthi: అధికారం కోల్పోవడంతో వైసీపీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా,  వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు నెల్లూరు మేయర్ స్రవంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకున్నా తనకు కార్పొరేటర్ టికెట్ ను శ్రీధర్ రెడ్డీ ఇచ్చారని..అంతేకాకుండా మేయర్ ను చేశారని అన్నారు.

Also read: దేశంలో మోగిన మరో ఎన్నికల నగారా.. ఆ 7 రాష్ట్రాల్లో ఎలక్షన్స్!

తమలాంటి ఎందరో కార్యకర్తలకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి రాజకీయ బిక్ష పెట్టాడన్నారు. రాజకీయాల్లో తనకు ధైర్యాన్ని ఇచ్చారని అన్నారు. శ్రీధర్ రెడ్డి వైసీపీని వీడినప్పుడు కూడా ఆయనతోనే ఉంటానని చెప్పామని అయితే, అప్పట్లో అధికార పార్టీ నేతల బెదరింపులకు భయపడి వైసీపీలోకి వెళ్ళాల్సి వచ్చిందన్నారు.

Also Read: అమరావతి ఇప్పుడెలా ఉంది? నిర్మాణాలు పనికి వస్తాయా?

శ్రీధర్ రెడ్డిపై విమర్శలు చేయాలని అక్కడి నాయకులు తమపై ఒత్తిడి తెచ్చారని అయితే, శ్రీధర్ రెడ్డిని ఒక్క మాట కూడా మాట్లాడలేదని స్పష్టం చేశారు. తమ తప్పులను శ్రీధర్ రెడ్డీ మన్నించి మమ్ములను అక్కున చేర్చుకోవాలని కోరుకుంటున్నామన్నారు.

Advertisment
తాజా కథనాలు