Kotamreddy : కోటంరెడ్డికి ఎదురుదెబ్బ..ఫ్యాన్ వైపు మేయర్ అడుగులు..!? నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే, టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి(kotamreddy sridhar reddy)కి ఎదురుదెబ్బ తగిలింది. కోటంరెడ్డికి మద్దతుగా నిలిచిన నెల్లూరు మేయర్ స్రవంతి(mayor sravanthi) తిరిగి వైసీపీ(YCP) గూటికే వెళ్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. శ్రీధర్‌రెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డితో స్రవంతి దంపతులకు విభేదాలు వచ్చాయని.. అందుకే మళ్లీ ఫ్యాన్ వైపు మళ్లుతున్నారని పొలిటికల్ టాక్ వినిపిస్తోంది. By Jyoshna Sappogula 13 Sep 2023 in నెల్లూరు రాజకీయాలు New Update షేర్ చేయండి Kotam Reddy Sridhar Reddy: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే, టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. కోటంరెడ్డికి మద్దతుగా నిలిచిన నెల్లూరు మేయర్ స్రవంతి.. తిరిగి వైసీపీ గూటికే వెళ్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. శ్రీధర్‌రెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డితో స్రవంతి దంపతులకు విభేదాలు వచ్చాయని.. అందుకే మళ్లీ ఫ్యాన్ వైపు మళ్లుతున్నారని పొలిటికల్ టాక్ వినిపిస్తోంది. వైసీపీ పాలనపై విసుగుచెందిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆ పార్టీ నుండి బయటికి వచ్చారు. అయితే,శ్రీధర్ రెడ్డికి మద్దతుగా నిలిచారు నెల్లూరు మేయర్, వైసీపీ నాయకురాలు స్రవంతి. తాజాగా కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డితో స్రవంతి దంపతులకు విభేదాలు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇరువురి మధ్యవిభేదాలను పరిష్కరించేందుకు శ్రీధర్ రెడ్డి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం కనిపించలేదు.ఈ క్రమంలోనే స్రవంతి దంపతులు తిరిగి వైసీపీలోనే కొనసాగాలని భావిస్తున్నారని సమాచారం. వైసపీ పార్టీ పెద్దలతో మేయర్ దంపతులు సమావేశమై చర్చలు జరిపినట్టుగా తెలిసింది. రెబల్ ఎమ్మెల్యేపై రివెంజ్..!! అయితే మరోవైపు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పై దర్గా మిట్ట పోలీసు స్టేషన్ లో రహస్యంగా కేసు నమోదైంది. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ రోజున ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసులు శ్రీధర్ రెడ్డి నివాసం ఉండే ఇంటి పరిసరాల్లో రోడ్డు పై బారికేడ్లను ఏర్పాటు చేశారు. కనీసం ఆ ప్రాంతం వారిని కూడా అటువైపు వెళ్ళనీయకుండ ఇబ్బంది పెట్టారు. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఇంట్లో కి ఎలాంటి నోటీసు లేకుండా వచ్చిన పోలీసులు ఇంటి ఆవరణంలో ఉన్న ఎమ్మెల్యే అనుచరుల పై దురుసుగా వ్యవహరించారు. దీంతో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పోలీసుల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటీసు లేకుండా ఇంట్లో కి వచ్చి మా వాళ్ళను బెదిరించడం ఏమిటీ..? అధికారం ఉందని మీ ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారంటూ పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. అయితే పోలీసులు ఈ విషయాన్ని పట్టించుకోలేదు. కానీ, సోషల్ మీడియాలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పోలీసుల పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన వీడియో వైరల్ అయింది. ఆ విడియో చూసిన వైసీపీ నేతలు పోలీసులు పై ఒత్తిడి తీసుకొచ్చి దర్గామిట్ట పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేయించారని సమాచారం. ఒకే ఎ , యస్, చేత బలవంతంగా కేసు పెట్టించారని.. ఎఫ్ ఐ ఆర్ లో శ్రీధర్ రెడ్డి తో పాటు.. మరి కొందరు అని పెట్టారని తెలుస్తోంది.. అయితే ఆ కొందరు ఎవరో తెలియాల్సి ఉంది.! Also Read: చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ వాయిదా #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి