Nellore: మేయర్ కు పెద్ద మొత్తం అందయా..!! అందుకే వైసీపీలోకి వెళ్లానున్నారా?

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి అత్యంత ఆప్తులుగా ఉన్న మేయర్ స్రవంతి, జయవర్ధన్ తిరిగి వైసిపి గూటికి ఎందుకు వెళ్ళారు? అంత విశ్వాసంగా ఉన్న మేయర్ ఇప్పుడు ఎమ్మెల్యే కోటంరెడ్డికి దూరమవడం జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వైసిపికి చెందిన రూఫ్ కుమార్ మేయర్ దంపతులను.. సజ్జల రామకృష్ణారెడ్డిని కలిపారు. వైసీపీలోనే కొనసాగుతామని.. రానున్న ఎన్నికల్లో వైసిపి గెలుపుకి కృషి చేస్తామని చెప్పినట్లు సమాచారం. మేయర్ స్రవంతికి పెద్ద మొత్తంలో నజరానా కూడా అందినాయనే పుకార్లు అయితే వినిపిస్తున్నాయి.

Nellore: మేయర్ కు పెద్ద మొత్తం అందయా..!! అందుకే వైసీపీలోకి వెళ్లానున్నారా?
New Update

Nellore: గత కొద్ది నెలల క్రితం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసిపిని విభేదించి తెలుగుదేశం పార్టీకి దగ్గరయ్యారు.అయితే రూరల్ నియోజకవర్గంలోని కార్పొరేటర్లలో పదిమందికి పైగా కార్పొరేటర్లు ఆయన వెంటే నడిచారు. అందులో మేయర్ స్రవంతి కూడా ఒకరు. అధికార పార్టీ నుంచి ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా.. ప్రలోభాలు పెట్టి నా.. ఎమ్మెల్యే కోటంరెడ్డి వెంటే నడిచారు మేయర్ స్రవంతి. ఎమ్మెల్యే కు నేను తోబుట్టువని,అవసరమైతే మేయర్ పదవినైనా వదులుకుంటాను కానీ.. ఎమ్మేల్యే కోటంరెడ్డిని వదిలే ప్రసక్తే లేదని పలు పార్టీ మీటింగులు, మీడియా సమావేశాల్లో ఖరాకండిగా చెప్పారు.

అప్పటి నుండి ఎమ్మెల్యే కోటంరెడ్డి.. వైసిపి ప్రభుత్వా నికి వ్యతిరేకంగా చేసిన ప్రతి ధర్నా, నిరసన, ఆందోళన లన్నిట్లోనూ స్రవంతి తన వంతు పాత్ర పోషించారు. మున్సిపల్ కౌన్సిల్ సమావేశాల్లోనూ వైసీపీ కార్పొరేటర్లను దీటుగా ఎదుర్కొన్నారు. చివరికి వైసిపి కార్పొరేటర్లు తన చీర లాగారని పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకెల్లారు. అంతకు ముందు వైసీపీలో ఎమ్మెల్యే కోటంరెడ్డి మంత్రి పదవి ఆశించి భంగపడ్డప్పుడు కూడా మేయర్ స్రవంతి తన పదవికి రాజీనామా చేసేందుకు వెనుకాడలేదు.

అంత విశ్వాసంగా ఉన్న మేయర్ ఇప్పుడు ఎమ్మెల్యే కోటంరెడ్డికి దూరమవడం జిల్లా రాజ కీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వైసిపికి చెందిన రూఫ్ కుమార్ మేయర్ దంపతులను.. సజ్జల రామకృష్ణారెడ్డిని కలిపారు.వైసీపీలోనే కొనసాగుతామని.. రానున్న ఎన్నికల్లో వైసిపి గెలుపుకి కృషి చేస్తామని చెప్పినట్లు సమాచారం. మేయర్ స్రవంతికి పెద్ద మొత్తంలో నజరానా కూడా అందినాయనే పుకార్లు అయితే వినిపిస్తున్నాయి.

అయితే మేయర్ స్రవంతిని ఎమ్మెల్యే కోటంరెడ్డికి దూరం చేసి వైసీపీలో మళ్లీ కొనసాగేలా చేసేందుకు నెల్లూరులోని కొందరు ప్రముఖ వైసిపి నాయకులు కీలక పాత్ర పోషించారు . చంద్రబాబు అరెస్టు తర్వాత నుంచి మేయర్ దంప తుల ఫోన్లు స్విచ్ ఆఫ్ లో ఉండడం విశేషం. అప్పటి నుంచి కూడా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి కాని.. ఆయన సన్నిహితులకు కానీ.. ఎవరికి కూడా మేయర్ దంప తులు అందుబాటులో లేకుండా పోయారు. అయితే మేయర్ స్రవంతి తీసుకున్న నిర్ణయం వెనుక అధికార పార్టీ ప్రలోభాలు, అలాగే కొన్ని పనులకు సంబంధించి రావాల్సిన బిల్లులు ఉన్నాయన్న ప్రచారం జరుగుతుం ది. ఏదేమైనాప్పటికీ మేయర్ స్రవంతి ఎమ్మెల్యే కోటం రెడ్డికి షాక్ ఇస్తూ ఆయనకు దూరమవడమనేది ఇప్పు డు జిల్లా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా నడుస్తుం ది. ఆలాగే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వద్ద ఉన్న కొంతమంది కార్పొరేటర్ లతో కూడా యంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి మంతనాలు జరిపినట్లు సమాచారం.

Also Read : పోరాడదామని డిసైడ్ అయ్యాక ఎన్ని అవమానాలనైనా భరిద్దాం- నారా లోకేశ్

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe