TDP: నెల్లూరులో రచ్చ..రచ్చ...పిడిగుద్దులు గుద్దుకున్న తెలుగు తమ్ముళ్లు..!

నెల్లూరు జిల్లా నాగలవెల్లటూరులో టీడీపీ వర్గ విభేదాలు బయటపడ్డాయి. రెండు గ్రూపులుగా విడిపోయిన కార్యకర్తలు పిడిగుద్దులు గుద్దుకున్నారు. మాజీ ఎమ్మెల్యే కొమ్మ లక్ష్మయ్యపై..కొందరు దాడి చేయడంతో వివాదం మొదలైంది. ఘర్షణలో ఎమ్మెల్యే అభ్యర్థి ఆనంను కార్యకర్తలు పక్కకు తోసేశారు.

New Update
TDP: నెల్లూరులో రచ్చ..రచ్చ...పిడిగుద్దులు గుద్దుకున్న తెలుగు తమ్ముళ్లు..!

Also Read: గోడ కూలి ఏడుగురు మృతి చెందిన ఘటన.. ఆరుగురు అరెస్టు

ఎన్నికల ప్రచారం నిమిత్తం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణరెడ్డి చేజర్ల మండలం నాగలవెల్లటూరు గ్రామంలో పర్యటిస్తుండగా టీడీపీకి చెందిన కొందరు వ్యక్తులు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఆనం రామనారాయణ రెడ్డితో కలిసి గ్రామంలో ఎన్నికల ప్రచారనికి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే కొమ్మ లక్ష్మయ్య నాయుడుపై  గ్రామానికి చెందిన కొందరు దాడి చేయడంతో ఈ వివాదం మొదలైనట్లు తెలుస్తోంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు