Government hospital: ప్రభుత్వాసుపత్రిలో బాలింత ప్రాణం తీసిన వైద్యుల నిర్లక్ష్యం..కడుపులో దూది మర్చిపోవడంతో..!!

ఆపరేషన్ సమయంలో డాక్టర్లు నిర్లక్ష్యంగా బాలింత కడుపులో దూది మర్చిపోవడంతో రెండు రోజుల నుంచి బాలింతకు తీవ్ర రక్తస్రావమైంది. దీంతో ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలిస్తుండగా ఆమె మార్గమధ్యలోనే ప్రాణాలు విడిచింది. దీంతో అచ్చంపేట అంబేద్కర్ చౌరస్తాలో ఆమె కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు..

New Update
Government hospital: ప్రభుత్వాసుపత్రిలో బాలింత ప్రాణం తీసిన వైద్యుల నిర్లక్ష్యం..కడుపులో దూది మర్చిపోవడంతో..!!

Government hospital: ప్రజారోగ్య వ్యవస్థను మెరుగు పర్చడానికి కొత్త కొత్త పథకాలను తెలంగాణ ప్రభుత్వం తీసుకొని వస్తూనే ఉంది. కాని వైద్యుల నిర్లక్ష్యం కారణంగా అభాసుపాలు కాక తప్పడం లేదు. ఆపరేషన్ చేసి కడుపులో కత్తినో లేక గుడ్డ ముక్కనో మర్చిపోయే సంఘటనలు ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. నిండు ప్రాణాలను వారి నిర్లక్ష్యం మింగేస్తుంది. అయితే ఇలా సంఘటనలు ఎన్ని జరిగినా.. వైద్యుల్లో మాత్రం ఆ నిర్లక్ష్య ధోరణి పోవడం లేదు.

 

బాలింత కడుపులో దూది మర్చిపోవడంతో..!

తాజాగా నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట ప్రభుత్వాసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా తీవ్ర విషాదం నెలకొంది. అచ్చంపేట దర్శన్ తండాకు చెందిన ఓ మహిళ డెలవరీ కోసం అచ్చంపేట ప్రభుత్వాసుపత్రిలో చేరింది. ఆమెకు నార్మల్ డెలివరీ కాకపోవడంతో డాక్టర్లు ఆపరేషన్ చేశారు. ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆపరేషన్ సమయంలో డాక్టర్లు నిర్లక్ష్యంగా ఆమె కడుపులో దూది మర్చిపోవడంతో రెండు రోజుల నుంచి బాలింతకు తీవ్ర రక్తస్రావమైంది. దీంతో ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో బాలింతను కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలిస్తుండగా ఆమె మార్గమధ్యలోనే ప్రాణాలు విడిచింది.

ఆందోళనకు దిగిన బంధువులు..!

అయితే వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే బాలింత ప్రాణాలు కోల్పోవడంతో.. ఆమె బంధువులు అచ్చంపేట అంబేద్కర్ చౌరస్తాలో ఆందోళనకు దిగారు. తమ కుటుంబానికి న్యాయం చేయాలని.. ఆపరేషన్ చేసిన వైద్యుల పై కఠిన చర్యలు తీసుకోవాలని వాళ్లు డిమాండ్ చేస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు