NEET UG Re Exam: నీట్ యూజీ రీఎగ్జామ్.. సగం మంది పరీక్షకు రాలేదు! 

కోర్టు ఆదేశాలతో గ్రేస్ మార్కులు పొందిన 1563 మంది అభ్యర్థులకు ఆదివారం రీ ఎగ్జామ్ నిర్వహించారు. అయితే, ఈ ఎగ్జామ్ కోసం 813 మంది అభ్యర్థులు మాత్రమే హాజరయ్యారు. మిగిలిన 750 మంది డుమ్మా కొట్టారు. ఇక నీట్ ఎగ్జామ్ కేసులో సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. 

New Update
NEET- UG 2024: నీట్ ఎగ్జామ్ విద్యార్థులకు ఈరోజు మళ్ళీ పరీక్ష.. ఎందుకంటే..

NEET UG Re Exam: నీట్-యుజి పరీక్షలో అవకతవకలకు సంబంధించి విద్యా మంత్రిత్వ శాఖ ఫిర్యాదుపై జూన్ 23, ఆదివారం సిబిఐ తన మొదటి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. మంత్రిత్వ శాఖ నుండి వచ్చిన కొన్ని సూచనల ఆధారంగా, IPC సెక్షన్లు 120-B (నేరపూరిత కుట్ర) 420 (మోసం) సహా వివిధ సెక్షన్ల క్రింద తెలియని వ్యక్తులపై FIR నమోదు చేశారు. సిబిఐ దర్యాప్తు కోసం రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది, అవి పాట్నా, గోద్రాకు వెళ్తాయి. కేంద్ర ప్రభుత్వం జూన్ 22 రాత్రి దర్యాప్తు బాధ్యతను సీబీఐకి అప్పగించింది. అంతకుముందు, శనివారం రాత్రి 9 గంటలకు NTA (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) డైరెక్టర్ జనరల్ సుబోధ్ కుమార్ సింగ్‌ను ప్రభుత్వం తొలగించింది. ఆయన స్థానంలో కొత్త డీజీగా ప్రదీప్ సింగ్ ఖరోలా నియమితులయ్యారు.

NEET UG Re Exam: ఇదిలా ఉంటే మే 5 న జరిగిన నీట్ పరీక్ష ఫలితంలో గ్రేస్ మార్కులు పొందిన 1563 మంది అభ్యర్థులకు ఆదివారం రీ ఎగ్జామ్ జరిగింది. పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:20 గంటల మధ్య నిర్వహించారు. అయితే, పరీక్ష రాయాల్సిన 1563 మందిలో 813 మంది అభ్యర్థులు మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. 750 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కాలేదు. కేవలం ఇద్దరు అభ్యర్థులకోసం చండీగఢ్‌లో పరీక్షా కేంద్రం ఏర్పాటు చేశారు. కానీ, వారిద్దరూ పరీక్షకు హాజరు కాలేదు.

ప్రభుత్వ చర్యలపై కృతజ్ఞతలు తెలిపిన IMA.. 

NEET UG Re Exam: నీట్ యూజీ పరీక్షల వివాదాలపై చర్యలు తీసుకున్నందుకు ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌లకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) కృతజ్ఞతలు తెలిపింది. ఇది కాకుండా, నీట్ యూజీ పరీక్షలో అవకతవకలపై దర్యాప్తును సీబీఐకి అప్పగించినందుకు, NTA డైరెక్టర్ జనరల్‌ను తొలగించినందుకు వికూడా ద్యా మంత్రిత్వ శాఖకు IMA కృతజ్ఞతలు తెలిపింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు