NEET UG 2024: నాకు ముందే అందింది.. NEET పేపర్ లీక్ లో అభ్యర్థి ఒప్పుకోలు.. నీట్ పరీక్ష వివాదంలో సంచలనం చోటు చేసుకుంది. పాట్నాకు చెందిన అభ్యర్థి అనురాగ్ యాదవ్ తనకు నీట్ పేపర్ పరీక్షకు ముందే అందిందని ఒప్పుకున్నాడు. ఆ ప్రశ్నలకు జవాబులు పరీక్ష ముందురోజు బాగా ప్రిపేర్ అయినట్టు చెప్పాడు. పరీక్ష పూర్తి అయిన తరువాత పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. By KVD Varma 20 Jun 2024 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి NEET UG 2024 పేపర్ లీక్ కేసులో పెద్ద మలువు వచ్చింది. ఈ కేసులో పాట్నాలో అరెస్టయిన అభ్యర్థి అనురాగ్ యాదవ్ పరీక్షకు ముందే పేపర్లు అందుకున్నట్లు అంగీకరించాడు. జాతీయ మీడియా కథనాల ప్రకారం ప్రశ్నలకు సమాధానాలను రాత్రంతా కంఠస్థం చేసేలా చేశారని కూడా అతను తెలిపాడు. "పరీక్షకు ఏర్పాట్లు చేశామని మా బాబాయి అంటే సికందర్ యాద్వేంద్ర కోట నుండి నాకు ఫోన్ చేశారు. నా పరీక్షా కేంద్రం దిబాయి పాటిల్ స్కూల్, పాట్నా. పరీక్ష హాల్‌కి వెళ్ళిన తర్వాత, నాకు అన్ని ప్రశ్నలు తెలిసిన విధంగా ఉన్నాయి. పరీక్ష తర్వాత పోలీసులు నన్ను అరెస్టు చేశారు. పరీక్షకు ముందు అనురాగ్ యాదవ్ పాట్నాలోని ప్రభుత్వ అతిథి గృహంలో బస చేశారు. బసకు అన్ని ఏర్పాట్లను సికందర్ యద్వేంద్ర చేశారు. నీట్ యూజీ పేపర్ లీక్ కేసును బీహార్ ఆర్థిక నేరాల విభాగం దర్యాప్తు చేస్తోంది. పేపర్ లీక్ కేసులో ప్రధాన సూత్రధారి సికందర్‌ను కూడా అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు 13 మందికి పైగా అరెస్టు చేశారు. వార్త అప్ డేట్ అవుతోంది.. #neet-2024 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి