NEET-UG 2024 Re-Exam: నీట్ యూజీ పరీక్షలో గ్రేస్ మార్కులు సాధించిన 1563 మంది విద్యార్థులకు ఈరోజు రీ ఎగ్జామ్ జరగనుంది. సుప్రీం కోర్టు (Supreme Court) ఆదేశాల మేరకు ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు. ఆరు కేంద్రాల్లో ఒకే షిప్టులో పరీక్ష జరుగుతుంది. పరీక్షా కేంద్రాల వద్ద విద్యాశాఖ అధికారులు ఉంటారు. జూన్ 30న ఫలితం రానుంది. అభ్యర్థులను మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్షా కేంద్రంలోకి అనుమతించనున్నారు. పరీక్ష మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. సాయంత్రం 5.20 గంటలకు ముగుస్తుంది.
నీట్ 2024 మే 5న నిర్వహించారు. దీని ఫలితం 4 జూన్ 2024న వచ్చింది. ఫలితాల్లో 67 మంది విద్యార్థులు అగ్రస్థానంలో నిలిచారు. వారికి ఆశ్చర్యకర రీతిలో 720కి 720 మార్కులు వచ్చాయి. ఆ తర్వాత పేపర్ లీక్ అయినట్లు వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ విషయంపై పెద్ద దుమారమే చెలరేగింది. ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. అనేక పిటిషన్లు నీట్ పరీక్షపై దాఖలయ్యాయి. 1563 మంది బాధిత విద్యార్థులకు మళ్లీ పరీక్ష నిర్వహించాలని ఎన్టీఏను సుప్రీంకోర్టు ఆదేశించింది.
NEET UG పరీక్షకు సంబంధించిన కాలక్రమం
- జూన్ 4, 2024 NEET ఫలితాలు ప్రకటించారు
- జూన్ 5, 2024 గ్రేస్ మార్కులు ఇచ్చారు
- జూన్ 6, 2024 పేపర్ లీక్ ఆరోపణలు వచ్చాయి
- జూన్ 7, 2024న నీట్ పేపర్ లీక్ వార్త తర్వాత విద్యార్థుల్లో కలవరం
- జూన్ 8, 2024 కలకత్తా కోర్టు జోక్యం చేసుకుంది
- జూన్ 8, 2024 AIMSA - UDFA CBI విచారణను కోరాయి
- జూన్ 10, 2024 అసమాన గ్రేస్ మార్కుల కోసం పిటిషన్ దాఖలు చేశారు
- జూన్ 10, 2024 రాజకీయ నాయకులు కూడా జోక్యం చేసుకున్నారు
- జూన్ 13, 2024న బాధిత విద్యార్థులకు మళ్లీ పరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది
- జూన్ 14, 2024 సుప్రీంకోర్టు ఆదేశం కారణంగా సీబీఐ దర్యాప్తు లేదు.
- జూన్ 15, 2024 పునః మూల్యాంకనం కోసం తాజా పిటిషన్ దాఖలు అయింది
- జూన్ 17, 2024 విద్యా మంత్రి ప్రధాన్ ఎట్టకేలకు వ్యత్యాసాలను అంగీకరించారు
- జూన్ 20, 2024 NEET పేపర్‌ను లీక్ చేయడం ద్వారా రూ. 30-30 లక్షలు చేతులు మారినట్టు అనురాగ్ యాదవ్ ఒప్పుకున్నారు.
నీట్ యూపీ పేపర్ లీక్‌పై దర్యాప్తు సీబీఐకి..
NEET Re-Exam: పేపర్ లీక్ వివాదంపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది. ఈ వివాదం నేపథ్యంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నీట్ యూజీ పేపర్ లీక్ కేసు దర్యాప్తును ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. మరోవైపు యూజీసీ నెట్ పేపర్‌పై కూడా సీబీఐ విచారణ జరుపుతోంది. ఎన్‌టీఏ పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు, పారదర్శకత తీసుకురావడానికి విద్యా మంత్రిత్వ శాఖ ఏడుగురు సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది.
10 రోజుల్లో 4 పెద్ద పరీక్షలు రద్దు చేశారు లేదా వాయిదా వేశారు..
- జాతీయ సాధారణ ప్రవేశ పరీక్ష పరీక్ష రద్దు చేశారు (జూన్ 12న జరగాల్సి ఉంది)
- UGT-NET పరీక్ష రద్దు చేయబడింది (జూన్ 18న జరగాల్సి ఉంది)
- CSIR UGC NET పరీక్ష వాయిదా పడింది (జూన్ 25 - 27 మధ్య జరగాల్సి ఉంది)
- NEET-PG వాయిదా పడింది (జూన్ 23న జరగాల్సి ఉంది)