NEET 2024: నీట్ పరీక్షలో గోల్ మాల్.. ప్రూఫ్స్ చూపిస్తూ కేంద్రంపై కేటీఆర్ ప్రశ్నల వర్షం!

నీట్ లో ఈ ఏడాది అనేక మంది 718, 719 మార్కులు సాధించారని.. +4, -1 మార్కింగ్ విధానంలో ఇది ఎలా సాధ్యమని కేంద్రాన్ని కేటీఆర్ ప్రశ్నించారు. గ్రేస్ మార్కులను ఎలా కేటాయించారో చెప్పాలన్నారు. ఐదేళ్లలో ఒక్క తెలంగాణ విద్యార్థి కూడా టాప్ 5 లో లేకపోవడంపై అనుమానం వ్యక్తం చేశారు.

NEET 2024: నీట్ పరీక్షలో గోల్ మాల్.. ప్రూఫ్స్ చూపిస్తూ కేంద్రంపై కేటీఆర్ ప్రశ్నల వర్షం!
New Update

నీట్ ఎగ్జామ్ లో (NEET 2024) అవకతవకలు జరిగాయంటూ వస్తున్న వార్తలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) స్పందించారు. వైద్యవృత్తిలోకి వెళ్లాలన్న కలతో లక్షలాది మంది విద్యార్థులు హాజరయ్యే నీట్ ఎగ్జామ్ కు సంబంధించిన కొన్ని వ్యవహారాలు చూస్తుంటే కచ్చితంగా అవకతవకలు జరిగినట్లు స్పష్టంగా అర్థం అవుతోందన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది నీట్ పరీక్షలో 67 మంది విద్యార్థులు 720/720 మార్కులు సాధించి ఫస్ట్ ర్యాంక్ సాధించడంతో పలు అనుమానాలకు వ్యక్తం అవుతున్నాయన్నారు. ఇంకా అనేక మంది విద్యార్థులు ఈ ఏడాది 718, 719 మార్కులు సాధించారన్నారు. నీట్ ఎగ్జామ్ లో +4, -1 మార్కింగ్ విధానం ఉంటుందన్నారు.
ఇది కూడా చదవండి: NEET 2024:నీట్ ఫలితాలపై వివాదం..పరీక్షలు మళ్ళీ జరపాలంటున్న తల్లిదండ్రులు

ఈ విధంగా 718, 719 మార్కులు రావడం ఎవరికీ సాధ్యం కాదన్నారు. అయితే.. దీనిని గురించి అడిగితే గ్రేస్ మార్కులు ఇచ్చామని చెబుతున్నారని ఫైర్ అవుతున్నారు కేటీఆర్. కొంత మంది స్టూడెంట్స్ కు ఏకంగా 100 వరకు గ్రేస్ మార్కులు ఇచ్చినట్లు అర్థం అవుతోందన్నారు. గ్రేస్ మార్కుల కేటాయింపునకు ఏ విధానం అవలంభించారన్నది చెప్పకపోవటం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. ఇంకా ఎన్నికల ఫలితాల రోజే హడావుడిగా నీట్ రిజల్ట్స్‌ ను విడుదల చేయడం ఎన్నో అనుమానాలను తావిస్తోందన్నారు.

గత ఐదేళ్లలో తెలంగాణ నుంచి ఒక్క విద్యార్థి కూడా నీట్ లో టాప్ 5 ర్యాంక్ సాధించలేదన్నారు. నీట్ పరీక్ష నిర్వహణలో అక్రమాల కారణంగానే ఇందుకు కారణమని నమ్ముతున్నామన్నారు. గ్రేస్ మార్కుల కేటాయింపునకు అనుసరిస్తున్న విధానాన్ని బయటపెట్టాలని డిమాండ్ చేశారు కేటీఆర్. ఒక ప్రామాణిక పద్ధతిలో విద్యార్థులందరికీ మేలు చేసేలా ఈ విధానం ఉండాలని బీఆర్ఎస్ కోరుకుంటోందన్నారు. కానీ కొంత మంది విద్యార్థుల గ్రూప్‌నకు మాత్రమే మేలు చేసేలా గ్రేస్ మార్కులు కలిపారన్నారు. అది సరైన విధానం కాదన్నారు కేటీఆర్. ఈ మొత్తం వ్యవహారంపై హై లైవల్ ఎక్స్ పర్ట్ కమిటీతో విచారణ జరిపించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోందన్నారు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి