Neeraj Chopra: శభాష్ నీరజ్ చోప్రా.. ఆటలోనే కాదు వ్యక్తిత్వంలోనూ బంగారమే

ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్ ఫైనల్‌లో బంగారు పతకం సాధించిన నీరజ్ చోప్రా. హంగేరి(Hungary) వేదికగా భారత త్రివర్ణ పతకాన్ని రెపరెపలాండించాడిన ఈ గోల్డెన్ బాయ్.. ఆటలోనే కాదు వ్యక్తిత్వంలోనూ శభాష్ అనిపించాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం నీరజ్ వ్యవహరించిన తీరుపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Neeraj Chopra: శభాష్ నీరజ్ చోప్రా.. ఆటలోనే కాదు వ్యక్తిత్వంలోనూ బంగారమే
New Update

నీరజ్ దేశభక్తికి అందరూ ఫిదా..

ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్ ఫైనల్‌లో బంగారు పతకం సాధించిన నీరజ్ చోప్రా. హంగేరి(Hungary) వేదికగా భారత త్రివర్ణ పతకాన్ని రెపరెపలాండించాడిన ఈ గోల్డెన్ బాయ్.. ఆటలోనే కాదు వ్యక్తిత్వంలోనూ శభాష్ అనిపించాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం నీరజ్ వ్యవహరించిన తీరుపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. నీరజ్ ఆటకు ఫిదా అయిన ఓ హంగేరి మహిళ ఆటోగ్రాఫ్ అడిగింది. అయితే భారత జెండాను తీసుకువచ్చి దానిపై సంతకం చేయాలని కోరింది. అందుకు నీరజ్ నిరాకరించాడు. జెండాపై సంతకం చేయలేనని.. టీషర్ట్‌పై చేస్తానని చెప్పాడు. అందుకు ఆమె అంగీకరించడంతో టీషర్టుపై ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నీరజ్ దేశభక్తిని నెటిజన్లు కొనియాడుతున్నారు. ఇదిరా మా భారతీయులకు జెండా పట్ల ఉండే గౌరవమని కామెంట్స్ చేస్తున్నారు.

బంగారు పతకంతో రికార్డు.. 

హంగేరీలోని (Hungary)బుడాపెస్ట్ వేదికగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో నీరజ్ చోప్రా స్వర్ణ పతకం(Gold Medal) సాధించి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. జావెలిన్ త్రో ఫైనల్లో 88.17 మీటర్లు విసిరి బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. తొలిసారి ఈ టైటిల్‌ను గెలుచుకున్నాడు. ఇంతకు ముందు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఏ భారతీయ అథ్లెట్ స్వర్ణం సాధించలేదు. 2022లో కేవలం రజత పతకంతో సరిపెట్టుకున్న నీరజ్ ఈసారి మాత్రం స్వర్ణం సాధించాడు.

రెండు పతకాలు సాధించిన తొలి అథ్లెట్‌..

ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ 2023లో అందరి చూపు భారత్‌కు చెందిన నీరజ్ చోప్రా, పాకిస్థాన్‌కు చెందిన అర్షద్ నదీమ్‌ల (Arshad Nadeem)పై పడింది. ఈ క్రమంలో ఇద్దరు ఆటగాళ్ల మధ్య హోరాహోరీ పోరు కూడా జరిగింది. నీరజ్ చోప్రా 88.17 మీటర్లు త్రో చేయగా, అర్షద్ నదీమ్ తన చెవ్లిన్‌ను 87.82 మీటర్ల వరకు విసిరాడు. నీరజ్ తన జావెలిన్‌ను నదీమ్ కంటే కేవలం 0.37 మీటర్ల ఎత్తుకు విసిరి బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. అయితే చివరికి ప్రతిసారీలాగే ఈసారి కూడా అర్షద్ నదీమ్‌ను నీరజ్ అధిగమించాడు. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ చరిత్రలో రెండు పతకాలు సాధించిన తొలి అథ్లెట్‌గా నీరజ్ చోప్రా నిలిచాడు. అంతేకాకుండా కేవలం 25 సంవత్సరాల వయస్సులో ఒలింపిక్స్, డైమండ్ లీగ్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్, ఇప్పుడు ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించాడు.

ఇది కూడా చదవండి: గోల్డ్ మెడల్ సాధించిన తొలి భారతీయ అథ్లెట్‎గా నీరజ్ చోప్రా రికార్డ్..!!

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe