తెలంగాణ రాజకీయాల్లో పటాన్ చెరు (Patancheru) అసెంబ్లీ నియోజకవర్గంలో మారుతున్న పరిణామాలు హాట్ టాపిక్ గా మారాయి. అనూహ్యంగా నీలం మధును (Neelam Madhu) పార్టీలోకి తీసుకుని టికెట్ కేటాయించిన హైకమాండ్.. నిన్న మళ్లీ అభ్యర్థిని మార్చింది. కాటా శ్రీనివాస్ గౌడ్ (Kata Srinivas Goud) పేరును ఖరారు చేసింది. మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ ఒత్తిడితోనే ఈ పేరు మార్పు జరిగిందని నీలం మధు వర్గీయులు భగ్గుమంటున్నారు. జిల్లాలోని మరో సీనియర్ నేత జగ్గారెడ్డి సైతం అభ్యర్థి మార్పుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Big Breaking: ఆ 90 నిమిషాల్లో ఏం జరిగింది.. మళ్లీ అభ్యర్థులను మార్చిన బీజేపీ
పేరు మారిస్తే ఊరుకునేదిలేదంటూ జగ్గారెడ్డి గతంలోనే హైకమాండ్ కు స్పష్టం చేశారు. కానీ ఆయన మాటను పెద్దగా పట్టించుకోకుండానే కాట శ్రీనివాస్ గౌడ్ పేరును ప్రకటించేశారు. తనను బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు మోసం చేశాయని నీలం మధు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇచ్చినట్టే ఇచ్చి తడిగుడ్డతో గొంతు కోసిందని ఆయన తన అనుచరల వద్ద వ్యాఖ్యానించారు. తనను మోసం చేసిన బీజేపీ, కాంగ్రెస్ ను ఓడించి తీరుతా అని అయన చెబుతున్నారు. దీంతో పటాన్ చెరు నియోజకవర్గ రాజకీయా పరిణామాలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి.