Crime News: ఇంట్లో కుక్క మలం, చచ్చిన ఎలుక.. ఇదేంటని అడిగితే కత్తితో కంటి దగ్గర పొడిచేసింది..!

తన హౌస్ కీపింగ్ నైపుణ్యాల గురించి నెగిటివ్‌ కామంట్స్ చేసిన స్నేహితురాలిపై నెబ్రాస్కాకు చెందిన మహిళ క్రూరంగా దాడి చేసింది. ఇంట్లో కుక్క మలం, చచ్చిన ఎలుక ఉండటాన్ని ప్రశ్నించిన స్నేహితురాలి ముఖంపై కత్తితో ఘోరంగా పొడిచేసింది.

New Update
Crime News: ఇంట్లో కుక్క మలం, చచ్చిన ఎలుక.. ఇదేంటని అడిగితే కత్తితో కంటి దగ్గర పొడిచేసింది..!

Crime News: ఇంటిని ఎవరైనా నీట్‌గా పెట్టుకోవాలనుకుంటారు. కొంతమంది శుభ్రంగా ఉంచుకుంటారు.. మరికొంతమంది బద్ధకంతో క్లీన్‌గా ఉంచుకోరు. కానీ ఎంతకాదనుకున్నా ఎవరూ కూడా ఇంట్లో చచ్చిన ఎలుకను అలానే ఉంచుకోని పనులు చేసుకోలేరు. ఎందుకంటే అది భయంకర కంపు కొడుతుంది. అసలు ముక్కు మూసుకోకుండా ఉండలేని పరిస్తితి ఉంటుంది. అదే ఇంట్లో ఒక వేళ ఎక్కడపడితే అక్కడ కుక్క మలముంటే ఇంకెంత ఘోరంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఊహించుకుంటేనే కడుపులో తిప్పుతుంది కదు.. అలా కడుపులో తిప్పడమే ఓ మహిళ చేసిన పాపం అయిపోయింది. ఇల్లు నీట్‌గా లేదని చెప్పినందుకు కత్తిపోట్లకు గురైంది.

publive-image తాటియానా ఇనిగ్యూజ్‌

హాల్‌లో కుక్క మలం.. చచ్చిన ఎలుక:
అమెరికాలోని నెబ్రాస్కా ప్రాంతంలో జరిగిన ఓ ఘటన గురించి తెలుసుకుంటే ఒళ్లు గగుర్పొడుచుకోకమానదు. 24 ఏళ్ల తాటియానా ఇనిగ్యూజ్‌ను కలవడానికి తన స్నేహితురాలు వచ్చింది.ఇంట్లోకి ఎంట్రీ ఇవ్వగానే ఫ్రెండ్‌కు ఘోరమైన కంపు వచ్చింది. ఇంట్లోని హాలంతా కుక్క మలంతో నిండి ఉంది. మధ్యలో ఒక చోట ఎలుక చచ్చి ఉంది. ఈ హాల్‌లోనే పిల్లలు ఆడుకుంటున్నారు. ఇదంతా చూసి తాటియానా ఫ్రెండ్‌కు రోత పుట్టింది. తాటియానాను ప్రశ్నించింది. ఇల్లు ఇంత కంపుగా పెట్టుకున్నావ్‌ ఏంటని అడిగింది. దీంతో తాటియానాకు చిర్రెత్తుకొచ్చింది.

కత్తితో దాడి.. తీవ్ర గాయాలు:
తన హౌస్‌కీపింగ్ స్కిల్స్‌ను తక్కువ చేసిన ఫ్రెండ్‌పై ఆవేశంలో ఊగిపోయిన తాటియానా కిచన్‌లోకి వెళ్లి ఓ చాకు తీసుకొచ్చింది. ఫ్రెండ్‌కు ఏం జరుగుతుందో అర్థంకాలేదు. పారిపోయేందుకు ప్రయత్నించగా అదిసాధ్యపడలేదు. ఆపద ముంచుకురావడంతో ఏం చేయాలో అర్థంకాని తాటియానా స్నేహితురాలు ముఖంపై చేతులు పెట్టుకోని కళ్లు మూసేసుకుంది. అయితే తాటియానా ఆ చేతులను పక్కకు జరిపి మరి ముఖంపై చాకుతో దాడి చేసింది. ఎక్కడపడితే అక్కడ పొడిచింది. తాటియానా ఇంటినుంచి అరుపులు వస్తుండడంతో చుట్టూపక్కల వాళ్ల పోలీసులుకు సమాచారం ఇచ్చారు. నిమిషాల్లో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. తాటియానా స్నేహితురాలు ముఖమంతా కత్తిగాట్టే కనిపించాయి. చేతిపై చాలా చోట్ల కత్తి తెగినట్టు పోలీసులు గుర్తించారు. బాధితురాలిని వెంటనే ఆస్పత్రికి తరిలించారు. తాటియానాను అరెస్ట్ చేశారు.

Also Read: వివాహ సమానత్వానికి పెద్దపీట.. చారిత్రాత్మక బిల్లుకు క్రిస్టియన్‌ కంట్రీ ఆమోదం!

WATCH:

Advertisment
తాజా కథనాలు