విపక్షాలకు బీజేపీ ఝలక్..ఈనెల 18న ఎన్డీయే పక్షాల సమావేశం..!!

విపక్షాలకు ఝలక్ ఇచ్చేందుకు బీజేపీ రెడీ అవుతోంది. జూలై 18న ఢిల్లీలో ఎన్డీఏ సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. బీజేపీకి వ్యతిరేకంగా విపక్షపార్టీలన్నీ ఏకమైన..తరుణంలో విపక్షాలకు కౌంటర్ ఇచ్చేందుకు ఎన్డీఏ ఈ సమావేశం నిర్వహిస్తోంది. ఈ సమావేశానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి కూడా ఆహ్వానం అందే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

New Update
విపక్షాలకు బీజేపీ ఝలక్..ఈనెల 18న ఎన్డీయే పక్షాల సమావేశం..!!

2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు రాజకీయ చదరంగం  సిద్ధమైంది. నరేంద్రమోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఓడించేందుకు ప్రతిపక్షాలన్నీ ఏకమైన వేళ...ఇప్పుడు బీజేపీ కూడా వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. విపక్షాల సమావేశానికి కౌంటర్ గా...ఎన్డీయేలోనూ ఏకతాటిపై ప్రచారం మొదలైంది. ఈ నేపథ్యంలో జులై 18న రాజధాని ఢిల్లీలో ఎన్డీయే భారీ సమావేశం జరగనుంది. ఎన్డీయేలో ఉన్న అన్ని పార్టీలతో పాటు ఇతర పార్టీలు కూడా ఇందులో పాల్గొనే అవకాశం ఉంది. ఈ సమావేశానికి అకాలీదళ్‌కు చెందిన సుఖ్‌బీర్ బాదల్, టీడీపీ నుంచి చంద్రబాబు నాయుడు కూడా హాజరవుతారని విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

publive-image

ఎన్డీయే బల నిరూపణ!
ప్రత్యర్థి పార్టీలను ఐక్యం చేసే ప్రయత్నాల్లో భాగంగా పాట్నాలో జరిగిన మీటింగ్‌ను ద్రుష్టిలో ఉంచుకుని... ఎన్డీఏ కూడా తన బలాన్ని నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఎన్డీయే తన బలాన్ని ప్రదర్శించేందుకు జూలై 18న సమావేశం ఏర్పాటు చేశారు. ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన, శిరోమణి అకాలీదళ్, జనతాదళ్ (యునైటెడ్) వంటి కొన్ని పాత మిత్రపక్షాల నిష్క్రమణతో కాషాయ పార్టీకి పెద్ద భాగస్వాములు లేరన్న భావనను ఈ సమావేశం ద్వారా తొలగించే అవకాశం ఉంది.

చిన్న పార్టీలను తమ వెంట తీసుకెళ్లే ప్రయత్నం:
కేంద్ర మంత్రి మండలిలో సాధ్యమైనంత వరకు పునర్వ్యవస్థీకరణలో భాగంగా... ఇటీవలి కాలంలో బిజెపికి మద్దతు ఇచ్చిన మిత్రపక్షాలందరినీ చేర్చుకోవడానికి బిజెపి తీవ్ర ప్రయత్నిస్తోంది. బీహార్‌లో ఆర్జేడీ-జేడీ(యూ) శిబిరంలోని చిన్న పార్టీలను కలుపుకొని రాష్ట్రంలో అధికారాన్ని పదిలపరుచుకునేందుకు బీజేపీ కసరత్తు చేస్తోంది. బీహార్ అధికార సంకీర్ణానికి అనుకూలంగా బలమైన సామాజిక సమీకరణం కూడా ఉంది.బీహార్ మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీకి చెందిన హిందుస్తానీ అవామ్ మోర్జా గత నెలలో నితీష్ కుమార్ ఆధ్వర్యంలో మహాఘట్ బందన్ తో తెగదెంపులు చేసుకుంది. తర్వాత ఆయన ఎన్డీఏలో చేరిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాలన్నీ కూడా బీజేపీకి కలిసివచ్చాయి. అటు మహారాష్ట్రలో అజిత్ పవార్ తిరుగుబాటు, కర్నాటకలో జేడీఎస్ తో పొత్తు పెట్టుకునే ఉహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో బీజేపీకి మరింత బలం చేకూరేలా కనిపిస్తోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు