మళ్లీ నరేంద్రుడికే పట్టం....! By G Ramu 29 Jul 2023 in నేషనల్ Scrolling New Update షేర్ చేయండి -ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీఏకే అధికారం -315 స్థానాల్లొ గెలిచే అవకాశం -ఇండియా కూటమికి 175 సీట్లు వచ్చే ఛాన్స్ - లోక్ సభలో మూడవ అతి పెద్ద పార్టీగా టీఎంసీ -నాల్గవ అతిపెద్ద పార్టీగా వైసీపీ -ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ సర్వేలో సంచలన విషయాలు ఇండియా టీవీ- సీఎన్ఎక్స్ సర్వే సంచలన విషయాలు వెల్లడించింది. దేశ ప్రజలు మరో మారు నరేంద్రుడికే పట్టం కట్టేందుకు రెడీ అవుతున్నారని తెలిపింది. మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ వైపై అత్యధికులు మొగ్గు చూపుతున్నారని పేర్కొంది. ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలు నిర్వహిస్తే ఎన్డీఏ 300లకు పైగా స్థానాల్లో విజయకేతనం ఎగుర వేస్తుందని సర్వేలో చెప్పింది. సర్వే ప్రకారం... ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలు జరిగితే మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 318 స్థానాల్లో విజయం సాదిస్తుంది. ఇక విపక్ష ఇండియా కూటమి 175 స్థానాల్లో విజయం సాధించే అవకాశాలు వున్నాయి. ఇక ఈ సారి లోక్ సభలో బీజేపీ బలం 303 నుంచి 290 పడిపోయే అవకాశం ఉంది. లోక్ సభలో ప్రధాన ప్రతిపక్షకాంగ్రెస్ పుంజు కోనుంది. లోక్ సభలో కాంగ్రెస్ స్థానాలు 52 నుంచి 66కు పెరగవచ్చు. ఇక బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ పార్టీ లోక్ సభలో మూడవ అతి పెద్ద పార్టీగా ఆవిర్బవించనుంది. గతంలో లోక్ సభలో టీఎంసీకి 22 సీట్లు ఉండగా ఈ సారి 29 సీట్లకు చేరనుంది. ఏపీలోని సీఎం జగన్ నేతృత్వంలోని వైసీపీ లోక్ సభలో నాలుగవ అతి పెద్ద పార్టీగా ఆవివర్బవించనుంది. గతంలో పోలిస్తే ఈ సారి వైసీపీకి నాలుగు స్థానాలు తక్కువ వచ్చే అవకాశం ఉన్నట్టు సర్వే స్పష్టం చేసింది. ఇక ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన(యూబీటీ) బలం 6 నుంచి 11కు పెరుగనుంది. ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు షాక్ తగలనుంది. షిండే పార్టీ స్థానాలు 12 నుంచి రెండుకు పడిపోనున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ 1 సీటు నుంచి పది సీట్లకు ఎగబాకనుంది. నవీన్ పట్నాయక్ కు చెందిన బిజూ జనతా దళ్ కు 12 నుంచి 13 సీట్లు వస్తాయి. యూపీలో బీజేపీ ప్రభంజనం సృష్టించనుంది. యూపీలో 80 స్థానాలకు 73 స్థానాల్లో గెలుపొందనుంది. ఇక గుజరాత్ లో బీజేపీ క్లీన్ స్వీప్ చేయనుంది. మొత్తం 26 స్థానాలను బీజేపీ కైవసం చేసుకోనుంది. ఇక కర్ణాటకలో కాంగ్రెస్ కు ప్రజలు షాక్ ఇవ్వనున్నారు. రాష్ట్రంలో బీజేపీ 28 స్థానాలకు గాను 20 స్థానాలను చేజిక్కిచ్చు కోనుంది. కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి క్లీన్ స్వీప్ చేయనుంది. మొత్తం 20 స్థానాలను హస్తగతం చేసుకోనుంది. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి