/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/SUPRIYA-SULE.jpg)
ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే... మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నాన్నేమైనా అనండి. కానీ మా నాన్నను ( శరద్ పవార్ ) పల్లెత్తు మాట అన్నా ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు. అవినీతితో దేశాన్ని సర్వ నాశనం చేస్తున్న బీజేపీకి వ్యతిరేకంగా శరద్ పవార్ పోరాటం చేస్తున్నారని సుప్రియా సూలె అన్నారు.
నాన్నకు అండగా ఉంటాను. కొందరు వయసు వచ్చిందని, ఇంట్లో కూర్చోమని చెబుతున్నారు. ఆశీర్వదించండి.. ఎందుకు.. రతన్ టాటా సాహెబ్ కంటే 3 ఏళ్లు పెద్దవాడు. కానీ నేటికీ అతను పనిచేస్తున్నాడు. సైరస్ పూనావల్లాకు 84 ఏళ్లు. అమితాబ్ బచ్చన్ వయస్సు 82 అయినా కూడా ప్రతి పాపులర్ యాడ్ అతనిదే. వారెన్ బఫెట్.. ఫరూక్ అబ్దుల్ తన తండ్రి కంటే మూడేళ్లు పెద్ద. ఎన్సీపీలో ఏం జరుగుతోందంటూ ప్రశ్నించారు. వయస్సు కేవలం ఒక అంకె మాత్రమే. మీరు ఇంట్లో కూర్చుని విశ్రాంతి తీసుకోండి. అంతా మేం చూసుకుంటాం. ఎన్సీపీకి అసలు ముఖం శరద్ పవార్ మాత్రమేనని సుప్రియ సూలే అన్నారు. పవర్ వస్తుంది..పోతుంది..పార్టీలో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించాలని శరద్ పవార్ అభ్యర్థించారు. ఎన్సీపి వద్ద ఒక్కటే నాణెం ఉంది. అది శరద్ పవార్ మాత్రమే అన్నారు.
పార్టీ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు వెళ్లిపోయినంత మాత్రానా పార్టీకి వచ్చిన నష్టం ఏమీ లేదన్నారు. ప్రజలు తమ వైపే ఉన్నారన్న సుప్రియా సూలె..ఎన్సీపీ నుంచి బయటకు వెళ్లిపోయిన ఎమ్మెల్యేలను తిరిగి తీసుకురావడం తనకు బాగా తెలుసన్నారు. కాగా ఎన్సీపీ గుర్తింపు తమందే తమదని అజిత్ పవార్ వర్గం, శరద్ పవార్ వర్గం ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నాయి.